Mango Side Effects: మామిడిపండ్లు మంచివే..! అతిగా తింటే ఎంత ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంకా మామిడి పండ్లను అతిగా తినటం వల్ల వేడి చేస్తుంది. వీటికి చలువ చేసే గుణం ఉండదు. అయితే తినడానికి ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెడితే వేడీ చేసే లక్షణం తగ్గుతుందని చెబుతారు. అంతేకాదు.. మరీ ఎక్కువగా మామిడి పండ్లు తింటే
Mango Side Effects : మండే వేడి ఉన్నప్పటికీ వేసవిలో ఒక మంచి విషయం ఏమిటంటే సమ్మర్ వచ్చిందంటే మార్కెట్లో మామిడి సందడి మొదలవుతుంది. తోతాపురి, అల్ఫోన్సో, లాంగ్రా వంటి అనేక మామిడి పండ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పండ్లలో రారాజు మామిడి అంటే అందరికీ ఇష్టమే. ఈ పండంటే ఇష్టంలేని వారంటూ ఉండరు. చాలా మందికి ఒకటీ రెండు మామిడి పండ్లు తింటే తృప్తి కలగదు. కడుపునిండా తిన్నా.. ఇంకా తినాలని తహతహలాడుతుంటారు. అదే మామిడి పండు రుచి ప్రత్యేకత. అయితే, అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుంది అన్నది నానుడి.. అలాగే, ఇష్టమైన మామిడి పండ్లను కూడా అతిగా తింటే అనర్థమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మామిడి పండ్లను ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
మామిడిపండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వేడి వాతావరణంలో మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వస్తుంది. మామిడికాయల సీజన్ రాగానే ప్రజలు వీటిని రకరకాలుగా చేసుకుని తింటారు. అయితే, మామిడి పండ్లను అతిగా తింటే శరీరంలో చక్కెర పెరుగుతుంది. మీకు డయాబెటిస్ లేకపోయినా, మీరు మామిడిపండ్లను ఎక్కువగా తింటే, చక్కెర కంటెంట్ పెరిగి తరచుగా అలసటను కలిగిస్తుంది. అందుకే, మామిడిని ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు మామిడి పండ్లను మితంగా తినటమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాదు.. స్లిమ్‌గా ఉండాలనుకునే వారు లేదా బరువు తగ్గాలనుకునే వారు కూడా మామిడి పండ్లను తక్కువ మొత్తంలో తినాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువ సహజమైన స్వీటెనర్లు ఉంటాయి. మామిడి పండ్లలో సహజంగా తీపి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని అధికంగా తినడం వల్ల ఈ సహజ చక్కెర వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గే పనిలో ఉన్న వారికి మామిడి పండ్లను ఎక్కువగా తినడం ఏమాత్రం ప్రయోజనకరం కాదు.
మామిడిలో ఉరుషియోల్ అనే రసాయనం ఉంటుంది. ఇది మానవ చర్మ సమస్యలను పెంచుతుంది. మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల చర్మం దురద, చర్మం పొట్టు రాలటం, శరీరంలో అలర్జీ లాంటిది వస్తుంది. ముక్కులో నీరు కారడం, కడుపునొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది. పరిశోధన ప్రకారం, మామిడి పండ్లు ఎవరికైనా అనాఫిలాక్టిక్ షాక్‌ను కలిగిస్తాయి. ఇది ఒక రకమైన అలెర్జీ ప్రతిచర్య, ఇది వెంటనే చికిత్స చేయకపోతే, వికారం, వాంతులు, షాక్, మూర్ఛకు కూడా కారణమవుతుంది.
యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా హెల్త్ సిస్టమ్ పరిశోధన ప్రకారం, మామిడిలో గ్లూకోజ్ కంటే ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో అసమతుల్యతను సృష్టిస్తుంది. ఇది ఫ్రక్టోజ్‌ను గ్రహించడం కష్టతరం చేస్తుంది. ఈ పరిస్థితి ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మీరు ఏదైనా అజీర్తిని ఎదుర్కొంటుంటే, మీరు మామిడి పండ్లను ఎక్కువగా తీసుకోవడం మానేయాలి.
ఇంకా మామిడి పండ్లను అతిగా తినటం వల్ల వేడి చేస్తుంది. వీటికి చలువ చేసే గుణం ఉండదు. అయితే తినడానికి ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెడితే వేడీ చేసే లక్షణం తగ్గుతుందని చెబుతారు. అంతేకాదు.. మరీ ఎక్కువగా మామిడి పండ్లు తింటే ముఖంపై మొటిమల సమస్యలు మొదలుకావొచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం