Telugu News Telangana Hyderabad Airport CISF staff save young woman's life when she attempted to commit suicide watch video
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం.. వైరలవుతున్న వీడియో..
ఆ సమయంలో మహిళ తనతో పాటు ఉన్న తన స్నేహితుడితో గొడవపడింది. ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సరైన సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అక్కడున్నవారు స్పందించి ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయిందని విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో యువతి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు డిపార్చర్ టెర్మినల్ వద్ద రెయిలింగ్ నుంచి కింది దూకేందుకు యత్నించింది. అయితే, అక్కడేవున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఆమెను కాపాడారు. ఆ సమయంలో మహిళ తనతో పాటు ఉన్న తన స్నేహితుడితో గొడవపడింది. ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సరైన సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అక్కడున్నవారు స్పందించి ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయిందని విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు వెల్లడించారు. యువతికి ప్రాణాపాయం తప్పటంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.
విమానాశ్రయంలో తొలిసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. కాగా, ఆ యువతి ఆత్మహత్యకు యత్నించిన దృశ్యాలు, ఆమెను కాపాడిన దృశ్యాలు అక్కడున్నవారు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సరైన సమయంలో స్పందించి ఆమెను కాపాడిన సీఐఎస్ఎఫ్, ఇతర ప్రయాణికులను నెటిజన్లు అభినందిస్తున్నారు.