‘అవన్నీ అసత్య ప్రచారాలే.. దేవుడే న్యాయం చేయాలి’.. అప్సర తండ్రి సెన్సేషనల్ కామెంట్స్..
అప్సర ఎపిసోడ్ అంతులేని కథగా కంటిన్యూ అవుతూనే ఉంది. అప్సరతో తన బిడ్డ పెళ్లి మాట నిజమేనని కార్తీక్ తల్లి ధనలక్ష్మి క్లారిటీ ఇచ్చింది. ఆ మరుక్షణమే టీవీ9తో మాట్లాడారు అప్సర తండ్రి.
అప్సర ఎపిసోడ్ అంతులేని కథగా కంటిన్యూ అవుతూనే ఉంది. అప్సరతో తన బిడ్డ పెళ్లి మాట నిజమేనని కార్తీక్ తల్లి ధనలక్ష్మి క్లారిటీ ఇచ్చింది. ఆ మరుక్షణమే టీవీ9తో మాట్లాడారు అప్సర తండ్రి. అప్సర పెళ్లి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారాయన. పైనల్‌గా రెండు చేతులు జోడించి దేవుడి మీదే భారం వేశారు. అంతకుముందు కార్తీక్ తల్లి ఆడియో రిలీజ్ చేశారు. అప్సర అంటే తమకేమాత్రం ఇష్టం లేదని.. కార్తీక్‌కి నచ్చడంతోనే ఇద్దరికీ పెళ్లి చేశామన్నారు ధనలక్ష్మి. పెళ్లయిన కొద్దిరోజులకే వేరు కాపురం పెట్టి అప్సర తన నైజం చాటుకుందన్నారు.
టూర్లు, లగ్జరీ లైఫ్‌ని అప్సర ఇష్టపడేదని.. ఆ ఇష్టాలతో కార్తీక్‌ను టార్చర్ పెట్టేదన్నారు ధనలక్ష్మి. ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, తన బిడ్డతో పెళ్లైందని కార్తీక్ తల్లి కన్ఫర్మ్ చేస్తే.. దేవుడే న్యాయం చేయాలంటూ అప్సర ఫ్యామిలీ అంటోంది. ఇక సాయికృష్ణ తండ్రేమో దర్యాప్తులోనే అన్ని నిజాలు తెలుస్తాయని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. అప్సర వ్యవహారం సీరియల్ మాదిరిగా ఓ అంతులేని కథలా సాగుతోంది.