Telangana Police: ఇది కదా ఫ్రెండ్లీ పోలిసింగ్.. గ్రూప్-1 అభ్యర్థులకు బాసటగా పెట్రోలింగ్ టీమ్..
పోలీసులంటే భయం కాదు.. ప్రేమ, స్నేహం, సన్నిహిత భావం ఉండాలనే ఉద్దేశ్యంతో ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానాన్ని అనుసరిస్తోంది తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్. ఆ నినాదానికి అనుగుణంగానే రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా నడుచుకుంటోంది. పోలీసులు చేపట్టే కార్యక్రమాలు డిపార్ట్‌మెంట్‌కు
పోలీసులంటే భయం కాదు.. ప్రేమ, స్నేహం, సన్నిహిత భావం ఉండాలనే ఉద్దేశ్యంతో ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానాన్ని అనుసరిస్తోంది తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్. ఆ నినాదానికి అనుగుణంగానే రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా నడుచుకుంటోంది. పోలీసులు చేపట్టే కార్యక్రమాలు డిపార్ట్‌మెంట్‌కు ప్రజలను మరింత చేరువ చేస్తున్నాయి. తాజాగా గ్రూప్ – 1 పరీక్ష రాసే అభ్యర్థులు కొందరు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. వారికి అండగా నిలిచారు తెలంగాణ పెట్రోలింగ్ పోలీసులు.
అభ్యర్థులను తమ పెట్రోలింగ్ వాహనాల్లో వారి వారి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు సమయానికి తీసుకెళ్లారు. పోలీసుల సహాయానికి అభ్యర్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారే కనుక సమయానికి తమను పరీక్ష కేంద్రాలకు చేర్చకపోతే.. ఇన్నాళ్లు కష్టపడిన చదువంతా వృథా అయ్యేదని పేర్కొంటున్నారు. తెలంగాణ పోలీసులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు అభ్యర్థులు. ఇక వీరి సహాయానికి తెలంగాణ సమాజం కూడా సలామ్ కొడుతోంది. ఇది కదా ఫ్రెండీ పోలిసింగ్ అంటే అంటూ కితాబిస్తున్నారు.
కాగా, గ్రూప్ 1 అభ్యర్థులను పరీక్షా కేంద్రాలను తీసుకెళ్తున్న పెట్రోలింగ్ కార్ల వీడియోలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ దిశానిర్దేశం మేరకు గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు సహాయ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా సెంటర్లకు చేరుకోలేని వారు, తప్పు పరీక్షా కేంద్రానికి వచ్చిన వారిని పెట్రోలింగ్ టీమ్ వారి వారి పరీక్షా కేంద్రాలకు చేర్చిందని పేర్కొన్నారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Under the instructions of #CP_Rachakonda Sri DS Chauhan IPS, the #RachakondaPolice #PatrolCars helped the #Group1 candidates, who were stuck in traffic or came to the wrong centers, in reaching their exam centers on time.#Rachakonda_Police #With_You #For_You #Friendly_Policing pic.twitter.com/9eOeyDgRDi
— Rachakonda Police (@RachakondaCop) June 11, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..