AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వామ్మో ఇలా అయితే చికెన్‌ ఏం కొనగలం.? రెండువారాల్లో రూ. 100కిపైగా..

సండే వచ్చిందంటే ఇంట్లో చికెన్‌ ఉండాల్సిందే లేదంటే ఏదో వెలితి. వారంలో ఒక్కరోజైనా ముక్క ఉండకపోతే ఏదో లోటుగా ఉంటుంది. చికెన్‌ బిర్యానీ అని, చికెన్‌ కర్రీ అని ఇలా రకరకాలుగా కోడిని లాగించేసే నాన్‌ వెజ్‌ ప్రియులకు ప్రస్తుతం చికెన్‌ ధరలు చుక్కలు చూపిస్తోంది...

Hyderabad: వామ్మో ఇలా అయితే చికెన్‌ ఏం కొనగలం.? రెండువారాల్లో రూ. 100కిపైగా..
Chicken Price
Narender Vaitla
|

Updated on: Jun 12, 2023 | 9:50 AM

Share

సండే వచ్చిందంటే ఇంట్లో చికెన్‌ ఉండాల్సిందే లేదంటే ఏదో వెలితి. వారంలో ఒక్కరోజైనా ముక్క ఉండకపోతే ఏదో లోటుగా ఉంటుంది. చికెన్‌ బిర్యానీ అని, చికెన్‌ కర్రీ అని ఇలా రకరకాలుగా కోడిని లాగించేసే నాన్‌ వెజ్‌ ప్రియులకు ప్రస్తుతం చికెన్‌ ధరలు చుక్కలు చూపిస్తోంది. వేసవి ముగింపు దశకు చేరుకున్న తరుణంలోనూ ధరలు పెరుగుతుండడం షాక్‌కి గురి చేస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా రూ. 100 ధర పెరగడంతో చికెన్‌ లవర్స్‌ ఉసూరుమంటున్నారు.

హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతం లైవ్‌ కోడి ధర రూ. 195కాగా, విత్‌ స్కిన్‌ రూ. 290గా ఉంది. ఇక స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర విషయానికొస్తే రూ. 320కి పెరిగింది. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ నెలలో కిలో చికెన్‌ ధర రూ. 150 ఉండగా ప్రస్తుతం ఏకంగా రూ. 320కి చేరింది. రెండు నెలల్లో ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. రవాణా ఛార్జీలు, కోళ్లదాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే వర్షాలు ప్రారంభమైన తర్వాత చికెన్‌ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..