Telangana Formations Day: పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ రన్’.. వివరాలివే..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ రన్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. సోమవారం నాడు ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా 2 కె, 4 కె రన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరుకానున్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ రన్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. సోమవారం నాడు ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా 2 కె, 4 కె రన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరుకానున్నారు. తెలంగాణ రన్‌లో నటి శ్రీలీల, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ సందడి చేయనున్నారు. ఇక రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేయర్ విజయ లక్ష్మి పాల్గొననున్నారు. తెలంగాణ రన్ నేపథ్యంలో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఎన్టీఆర్ మార్గ్ చుట్టుపక్కల 1,400 కార్లు 100 బస్సులు పార్కింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోనూ పోలీసుల ఆధ్వర్యంలో 2 కె రన్, 5 కె రన్ నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, మేడ్చల్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి ఇలా అన్ని జిల్లాల్లో తెలంగాణ రన్ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ రన్‌లో పాల్గొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..