AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అయ్య బాబోయ్‌ ఇదేక్కడి దారుణం.. గడ్డి తినే జింక పామును కసకస నమిలేస్తోంది..

హెర్బివర్‌ జాతికి చెందిన జింక.. మాంసాహారాన్ని తీసుకోవడం అనేది ఆశ్యర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయని కామెంట్స్ చేశారు.

Watch: అయ్య బాబోయ్‌ ఇదేక్కడి దారుణం.. గడ్డి తినే జింక పామును కసకస నమిలేస్తోంది..
Deer, Eats Snake
Jyothi Gadda
|

Updated on: Jun 12, 2023 | 1:08 PM

Share

మనకు తెలిసినంత వరకు ఇప్పటివరకు కనిపించిన జింకలు స్వచ్ఛమైన శాకాహారులు, పచ్చని గడ్డిని, పొదల్లో పెరిగిన పచ్చని ఆకులను తింటూ అడవులలో స్వేచ్ఛగా తిరుగుతాయి. మాంసాహారం జోలికి వెళ్లవు. గడ్డి, ఆకులు, పండ్లు.. ఇవే వాటి ఆహారం. కానీ అవి మాంసాహారులు అని తెలిస్తే ఖచ్చింతా షాక్‌ అవ్వాల్సిన విషయమే. అయితే, ఇప్పుడు ఇక్కడ ఒక గోధుమ రంగు జింక తన నోటిలో గడ్డి లాంటి పామును నమిలినట్లు కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. మన కళ్ళను మనం నమ్మలేనంతా వీడియో సోషల్ మీడియా వేదికగా చూసిన అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ @TheFigen_ పోస్ట్ చేసింది. కాగా, 21 సెకన్ల వీడియోలో ఒక పామును జింక నమలడం కనిపించింది. ఈ వీడియో చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో చూసిన నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సైన్స్‌కు కొత్త సవాల్‌ను విసిరినట్టుగా చేసింది ఈ వీడియో. అంతలా షాక్‌ అవ్వాల్సిన విషయం ఏంటంటే.. ఓ జింక.. చనిపోయిన పామును కసకస నిమిలి మింగడం కనిపించింది. హెర్బివర్‌ జాతికి చెందిన జింక.. మాంసాహారాన్ని తీసుకోవడం అనేది ఆశ్యర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయని కామెంట్స్ చేశారు. శాకాహార జంతువులు కొన్నిసార్లు పాములను తింటాయని చెప్పుకొచ్చారు. అందుకు ఈ వీడియోనే ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. జింకలు కేవలం గడ్డి మాత్రమే ఎందుకు తినాలి. కొత్తగా ప్రయత్నించేందుకే ఈ జింక ఇలా చేస్తోందని ఒకరు వ్యాఖ్యానించారు. బహుశా జింక అది ఎండు గడ్డి అనుకుంటుందేమో అని మరొకరు వ్యాఖ్యానించారు. యూపీఎస్సీ పరీక్షలో జింకలు శాకాహారమా, సర్వభక్షకమా అని ప్రశ్నిస్తే తికమక పడతాను అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తంగా, ఈ వీడియోను 10 మిలియన్ల కంటే ఎక్కువ మందే చూశారు. అయితే ఈ సీన్‌ ఎక్కడ జరిగింది..?  అనేది మాత్రం ఎలాంటి సమాచారం లేదు. వీడియో మాత్రం వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి