ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి… మెరుపు వేగంతో దూసుకొచ్చిన లేడీ కానిస్టేబుల్‌.. ఆ తర్వాత

మహిళా కానిస్టేబుల్ ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుకుంది. ఈ వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ షేర్ చేసింది. ఈ వీడియోపై పలువురు స్పందించారు. సదరు లేడీ కానిస్టేబుల్‌ చేసిన పనిని అంతా కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ గా మారింది.

ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి... మెరుపు వేగంతో దూసుకొచ్చిన లేడీ కానిస్టేబుల్‌.. ఆ తర్వాత
Lady Constable Fear
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2023 | 8:05 PM

రైలు ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో పరిస్థితి అదుపు తప్పితే అంతే ప్రమాదకరంగా ఉంటుంది. సరసమైన ధరలో ప్రయాణాన్ని అందించే రైలు..జాగ్రత్తగా ఉండకపోతే ఆ ప్రయాణం అనంత లోకాలకు దారితీస్తుంది. ఇక కొందరు తమ జీవితంపై విరక్తితో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అలాంటిదే ఇక్కడ ఒక వీడియో వైరల్‌గా మారింది. రైలు వస్తుందని నిర్ధారించుకున్న తర్వాత ఒక వ్యక్తి ప్లాట్‌ఫాం దిగి రైల్వే ట్రాక్‌పై తలపెట్టి పడుకున్నాడు. చాకచక్యంగా వ్యవహరించిన అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వెంటనే ట్రాక్‌పైకి దూకి ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు. ఆ మరుక్షణంలోనే రైలు వేగంగా దూసుకెళ్లింది. సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని పూర్వా మేదినీపూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో కొద్దిమంది ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే ఒక వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం ఎదురు చూస్తున్నట్లుగా నిలబడి ఉన్నాడు. కాసేపటికి రైలు రావటం కనిపించింది. హారన్ మోగిస్తూ రైలు అతి వేగంతో వచ్చింది. రైలు కోసం వేచి ఉన్న ఆ వ్యక్తి.. ప్లాట్‌ఫారమ్‌పై నుంచి ట్రాక్‌పైకి దూకాడు. రైలు వస్తున్న లైన్లో పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మహిళా కానిస్టేబుల్ K సుమతి అతన్ని గమనించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పట్టాలపైకి దూకేసింది. అతన్ని పట్టుకుని పక్కకు తోసేసింది. ఇంతలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఇతర సిబ్బంది, స్థానికులు కూడా ఆమెకు సాయం చేశారు. దీంతో అతడు తృటిలో ప్రాణాలో తప్పించుకోగలిగాడు. మహిళా కానిస్టేబుల్ ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుకుంది. ఈ వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ షేర్ చేసింది. ఈ వీడియోపై పలువురు స్పందించారు. సదరు లేడీ కానిస్టేబుల్‌ చేసిన పనిని అంతా కొనియాడారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఎంతో మంది సిబ్బంది, రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యలకు పాల్పడిన వారిని, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడారు. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిలో కొందరిని గుర్తించినప్పటికీ.. చాలా మందిని మాత్రం గుర్తించడం సాధ్యం కావడం లేదు. వారి మృతదేహాలు పూర్తిగా దెబ్బ తినడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. ఇప్పటికీ వాళ్ల మృత దేహాలు మార్చురీలోనే ఉండిపోయాయి. ఈక్రమంలో మృతులను గుర్తించేందుకు అధికారులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. మృతులను గుర్తించేందుకు రైల్వే అధికారులు తొలుత ఆధార్‌ నిపుణులను రప్పించి మృతదేహాల నుంచి వేలి ముద్రలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, చాలామంది చేతుల వేళ్లు బాగా దెబ్బతినడం, మృతదేహాలు కూడా అనుకూలంగా లేకపోవడంతో వేలి ముద్రలు తీసుకోవడం సాధ్యం కాలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి