Elephant Viral Video: ఖడ్గమృగంతో ఏనుగు ఒంటరి పోరాటం.. భీకర యుద్ధంలో చివరకు..

ప్రస్తుతం ఓ ఏనుగు, ఖడ్గమృగం మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒక రాత్రి సమయంలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఏనుగు ఖడ్గమృగంతో పోరాడుతున్న దృశ్యం కనిపించింది.

Elephant Viral Video: ఖడ్గమృగంతో ఏనుగు ఒంటరి పోరాటం.. భీకర యుద్ధంలో చివరకు..
Rhinoceros Elephant Fight
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2023 | 9:11 AM

అడవి జంతువుల పోరాటాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింహాలు, చిరుతపులులు, ఏనుగుల మధ్య జరిగే పోరాట దృశ్యాలు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఏనుగుకు సంబంధించినది. సాధారణంగా ఏనుగు సున్నితమైన జంతువు, కానీ, గజరాజుకు కోపం వస్తే మాత్రం బీభత్సం సృష్టిస్తుంది. ఎదురుగా ఉన్నది ఏదైనా సరే, భస్మం కావాల్సిందే. ప్రస్తుతం ఓ ఏనుగు, ఖడ్గమృగం మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒక రాత్రి సమయంలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఏనుగు ఖడ్గమృగంతో పోరాడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.

వైరల్‌గా మారిన వీడియోలో, ఏనుగు, ఖడ్గమృగం ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. ముందుగా ఒకదాని వైపు మరొకటి చూసుకుంటూ నిలబడ్డాయి. అంతలో ఖడ్గమృగం తన కొమ్ములను ఊపుతూ..ఏనుగును పోరాటానికి ఆహ్వానిస్తున్నట్టుగా చేసింది. ఏనుగువైపు మూర్ఖంగా చూసిన ఖడ్గమృగానికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేకుండా చేసింది ఆ గజరాజు. భయంకరమైన ఏనుగు ఖడ్గమృగంపై దాడి చేసింది. ఏనుగు తన బలంతో ఖడ్గమృగాన్ని నేలపై పడేసింది. ఆ తర్వాత తన తొండంతో ఖడ్గమృగాన్ని చుట్టేసి ఎత్తి నేలకేసి కొట్టింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో కనిపించే దృశ్యం మీరు సాధారణంగా మరెక్కడా చూసుండరు. ఈ వైరల్‌ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సాకేత్ బడోలా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కొన్ని సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 464.9 k వీక్షణలు, చాలా లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి