ఒకే రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.. ? నమ్మలేరు

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రన్‌వేపై ఒకేసారి రెండు విమానాలు ఎలా ల్యాండ్ అయ్యాయో స్పష్టంగా తెలియలేదు. దీనిపై విమానయాన సంస్థలు కానీ, విమానాశ్రయ అధికారులు కానీ స్పందించలేదు. విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉన్నాయి. ప్రస్తుతం ఘటన జరిగిన రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని విమానాల రాక ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.

ఒకే రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.. ? నమ్మలేరు
Tokyo Airport
Follow us

|

Updated on: Jun 10, 2023 | 1:50 PM

ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు వస్తే ఏమవుతుంది. అది ఊహించటం కూడా భయంకరంగా ఉంది కదా..? కానీ, ఇలాంటి సంఘటనే జపాన్‌ రాజధాని టోక్యో నగరంలో చోటు చేసుకుంది. టోక్కోలోని హనెడా ఎయిర్‌పోర్ట్‌లో ఇవాళ ఉదయం 11 గంటలకు ఒకే రన్ వేపైకి రెండు విమానాలు వచ్చాయి. కానీ, అదృష్ట వశాత్తు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు వాణిజ్య విమానాలు ప్రమాదవశాత్తు రన్‌వేపై ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం, ఈ సంఘటన శనివారం ఉదయం 11 గంటలకు జరిగింది.

బ్యాంకాక్‌ నుంచి బయల్దేరిన థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఇంటర్నేషనల్‌ విమానం, తైపీకి బయల్దేరిన ఇవా ఎయిర్‌వేస్‌ విమానం ఒకేసారి రన్‌వేపైకి వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి. వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాలను నిలిపివేశారు. ఒకే రన్‌వేపై రెండు విమానాలు ఆగి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

అయితే, ఒక విమానం రెక్కలు (రెక్క) స్వల్పంగా దెబ్బతిన్నాయి. రెక్కల భాగాలు రన్‌వేపై పడిపోయాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రన్‌వేపై ఒకేసారి రెండు విమానాలు ఎలా ల్యాండ్ అయ్యాయో స్పష్టంగా తెలియలేదు. దీనిపై విమానయాన సంస్థలు కానీ, విమానాశ్రయ అధికారులు కానీ స్పందించలేదు. విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉన్నాయి. ప్రస్తుతం ఘటన జరిగిన రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని విమానాల రాక ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..