Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది నిర్లక్ష్యం కాదు.. 24 ఏళ్ల క్రితం CRPF నుండి తొలగించిన డ్రైవర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు..

సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన ఆయనకు ఎట్టకేలకు ఊరట లభించింది. అయితే, వీరేంద్ర కుమార్‌ విషయంలో అసలేం జరిగింది..? CRPF తనను ఎందుకు విధుల్లోంచి తొలగించింది? హైకోర్టు తన తీర్పులో ఇంకా ఏం చెప్పింది.? ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఇది నిర్లక్ష్యం కాదు.. 24 ఏళ్ల క్రితం CRPF నుండి తొలగించిన డ్రైవర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు..
Crpf Driver
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 10, 2023 | 1:06 PM

వాహనదారులు ఒక్కోసారి చేసే చిన్న పొరపాటు ప్రమాదాలకు దారి తీస్తుంది. కానీ, దానిని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని, లేదంటే ర్యాష్ డ్రైవింగ్‌గా పరిగణించలేమంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో 24ఏళ్ల క్రితం CRPF నుండి తొలగించిన డ్రైవర్‌ను తిరిగి విధుల్లో చేర్చుకుంది CRPF. 1991లో సీఆర్‌పీఎఫ్‌లో చేరిన వీరేంద్ర కుమార్ పదేళ్లపాటు విధులు నిర్వహించారు.  సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన ఆయనకు ఎట్టకేలకు ఊరట లభించింది. అయితే, వీరేంద్ర కుమార్‌ విషయంలో అసలేం జరిగింది..? CRPF తనను ఎందుకు విధుల్లోంచి తొలగించింది? హైకోర్టు తన తీర్పులో ఇంకా ఏం చెప్పింది.? ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

1999 ఏప్రిల్ 24వ తేదీ. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని 40వ నెంబరు జాతీయ రహదారిపై CRPF ట్రక్కు ప్రమాదానికి గురైంది. యూ టర్న్‌పై లారీ బోల్తా పడింది. అప్పుడు వీరేంద్ర కుమార్‌ వాహనాన్ని నడిపారు. అందులో మరికొందరు జవాన్లు, ట్రక్కు నిండా సరుకులు ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. ట్రక్కు బాగా దెబ్బతింది. CRPF ఆ తర్వాత విచారణను ఏర్పాటు చేసింది. జనవరి 2001లో కుమార్‌ను సర్వీస్ నుండి తొలగించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లోని కోర్టు అదే సంవత్సరం అతనిని తిరిగి నియమించాలని ఆదేశించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానా హైకోర్టులో దిగువ కోర్టును సవాలు చేసింది.

2001లో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కేంద్రం చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేశారా లేక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారా అనే విషయాన్ని నిర్ధారించేందుకు స్థలం, పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుందని జస్టిస్ హర్‌సిమ్రత్ సింగ్ సేథీ ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తన తీర్పులో కోర్టుకు సమర్పించిన వాస్తవాలను బట్టి కొండ ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఓవర్‌లోడ్‌తో కూడిన ట్రక్కును నడుపుతున్నప్పుడు డ్రైవర్ యు-టర్న్‌ను తప్పుగా అంచనా వేశారు. వాహనంలో కొన్ని సాంకేతిక లోపాలు కూడా ప్రమాదానికి కారణమయ్యాయి.

ఇవి కూడా చదవండి

జస్టిస్ సేథీ మాట్లాడుతూ, అలక్ష్యం కంటే ఇతర ప్రధాన కారణం, లేదా ఇతర పరిస్థితుల వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనల్లో ట్రక్కులో ఉన్న కొంతమంది జవాన్లు ప్రమాదంలో గాయపడినా, ట్రక్కు బాగా దెబ్బతిన్నందున, డ్రైవర్‌న్‌ విధుల్లోంచి తొలగించే అంత పెద్ద శిక్ష ఉండదని చెప్పారు.

విచారణ సందర్భంగా, ట్రక్కు బ్రేక్ సిస్టమ్‌లో ఏదైనా లోపం ఏర్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేమని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా అంగీకరించారు. తన క్లయింట్‌ను తిరిగి చేర్చుకుంటే, తొలగించినప్పటి నుండి తన జీతంలో 50 శాతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వీరేందర్ కుమార్ తరపు న్యాయవాది చెప్పారు. దీనిపై హైకోర్టు సీఆర్పీఎఫ్ వీరేంద్ర కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పాటు డ్రైవర్ లాయర్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని 8 నెలల్లోగా సీఆర్పీఎఫ్ ప్రత్యామ్నాయ శిక్షను ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..