AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇది మంచం కాదు.. లీటర్‌ పెట్రోల్‌ పోస్తే చాలు.. రోడ్డుమీద రయ్‌ రయ్‌.. మంటూ పరిగెడుతుంది..!

జీవితాన్ని సులభతరం చేసుకునే ప్రక్రియలోప్రజలు జుగాద్ ద్వారా ఇలాంటి ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణలు కనిపెడుతుంటారు. మట్టి కుండతో ఎయిర్‌ కూలర్‌, టేబుల్‌ ఫ్యాన్‌తో ఏసీ లాంటి చల్లదనం, సైకిల్‌ను బైక్‌గా మార్చేసిన అనేక వీడియోలు ఇప్పటికే మనం సోషల్ మీడియాలో అనేకం చూశాం. వాటిని చూశాక.. ఇది కూడా సాధ్యమేనా అనే సందేహం కలుగకమానదు.

Watch: ఇది మంచం కాదు.. లీటర్‌ పెట్రోల్‌ పోస్తే చాలు.. రోడ్డుమీద రయ్‌ రయ్‌.. మంటూ పరిగెడుతుంది..!
3 Wheeler Vehicle
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2023 | 10:21 AM

Share

మంచాన్ని వాహనంగా మార్చగల సమర్థులు, ఘనులు మన మన భారతీయులు మాత్రమే చేయగలరు.. ! అవును, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని నవ్వించడమే కాకుండా మిమ్మల్ని ఆలోచింప జేస్తుంది. వీడియో చూస్తే మీరు.. ఇలాంటి వారికి ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అంటారు. అయితే ఇలాంటి జుగాడ్‌ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కానీ, వారి దైనందిన జీవితాన్ని సులభతరం చేసుకునే ప్రక్రియలోప్రజలు జుగాడ్ ద్వారా ఇలాంటి ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణలు కనిపెడుతుంటారు. మట్టి కుండతో ఎయిర్‌ కూలర్‌, టేబుల్‌ ఫ్యాన్‌తో ఏసీ లాంటి చల్లదనం, సైకిల్‌ను బైక్‌గా మార్చేసిన అనేక వీడియోలు ఇప్పటికే మనం సోషల్ మీడియాలో అనేకం చూశాం. వాటిని చూశాక.. ఇది కూడా సాధ్యమేనా అనే సందేహం కలుగకమానదు. ఈ కుర్రాళ్ల జుగాద్ కూడా అలాంటిదే. ఇక్కడ ఓ యువకుడు ఇంట్లో నిరుపయోగంగా పడివున్న చక్రాలు, మోటారు బిగించి మంచాన్ని కదిలే వాహనంగా తయారు చేశాడు. అదేలా ఉందో వైరల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి, వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు అనేది మాత్రం తెలియరాలేదు.

ఈ వీడియోను జూన్ 9న ట్విట్టర్ హ్యాండిల్ @ముంబైకహార్9 – ఇన్నోవేటివ్ జుగాడ్‌ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఇక్కడ కొందరు యువకులు ఇంట్లో  ఉండే మంచాన్ని మూడు చక్రాల వాహనంగా మార్చారు. ఆ కదిలే మంచం వెహికిల్‌ పై కూర్చుని ఆ ఇద్దరు యువకులు పెట్రోల్ పంప్‌కు రావటం వీడియోలో కనిపించింది. అందులో ఒకరు మంచ వాహనాన్ని డ్రైవ్‌ చేస్తున్నట్టుగా కనిపించింది. అయితే, ఆ వాహనంలో వారు పెట్రోల్‌ కొట్టించేందుకు వచ్చారు. దీంతో పెట్రోల్‌ పంపు వద్ద నిలబడి ఉన్న వాహనదారులు, స్థానిక ప్రజలు విచిత్ర వాహనాన్ని వింతగా చూస్తుండి పోయారు. ఇదేం బండిరా సామీ అనుకుంటూ అందరూ తమ సెల్‌ఫోన్‌ కెమెరాలో ఫోటోలు, వీడియోలు తీయటం మొదలుపెట్టారు. దాదాపు 3 నిమిషాల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వాహనాన్ని తయారు చేయడానికి మంచం, సైకిల్ చక్రాలు, కార్ స్టీరింగ్‌ను ఉపయోగించారు. మంచం నాలుగు కాళ్ల దగ్గర చక్రాలు అమర్చారు. ఒక వైపు హ్యాండిల్, రేస్ మొదలైనవి సెట్ చేశారు. మరోవైపు మోటారు కూడా బిగించి ఉంది. ఈ వాహనం సగటున గంటకు 50 నుంచి 60 కి.మీల వేగాన్ని ఇస్తుందని, ఇందులో నలుగురైదుగురు మనుషులు కూర్చుని హాయిగా ప్రయాణించవచ్చునని వాహనం తయారీదారుడు చెబుతున్నమాట. ఈ మంత్రముగ్ధమైన వస్తువును తయారు చేసిన వ్యక్తిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. లైకులు, ట్విట్లు, షేర్లతో మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ..

Follow Us