Watch Video: అడవిలో ఉన్న ఏనుగును ఇబ్బంది పెట్టాడు.. చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగో పరుగు..

మనుషులు కొన్ని జంతువులపై తమ ప్రేమ, ఆప్యాయతను చూపిస్తారు. అవి కూడా వారిని ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. కానీ వాటిని ఇబ్బంది పెట్టేలా చూస్తే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. ముఖ్యంగా అడవిలో ఉండే జంతువులతో పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉంటుంది.

Watch Video: అడవిలో ఉన్న ఏనుగును ఇబ్బంది పెట్టాడు.. చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగో పరుగు..
Elephant Chasing
Follow us
Aravind B

|

Updated on: Jun 10, 2023 | 11:55 AM

మనుషులు కొన్ని జంతువులపై తమ ప్రేమ, ఆప్యాయతను చూపిస్తారు. అవి కూడా వారిని ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. కానీ వాటిని ఇబ్బంది పెట్టేలా చూస్తే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. ముఖ్యంగా అడవిలో ఉండే జంతువులతో పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. తాజాగా అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఉన్న ఓ అడవిలోకి ఓ వక్తి ప్రవేశించాడు. అయితే అక్కడ ఓ ఏనుగు ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటోంది. ఇంతలో అతను వచ్చి ఆ ఏనుగును ఇబ్బంది పెట్టాడు. దాని ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఏనుగు అతనిపై ఆగ్రహించింది. అతన్ని కొద్దిదూరం వరకు వెంబడించింది. ఏనుగు వెంబడించడంతో ఆ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు.

అలా పరిగెత్తుంచూ రోడ్డుపైకి వచ్చాడు. అతడ్ని రక్షించేందుకు అక్కడున్న ఉన్న టూరిస్టులు, స్థానికులు కూడా శబ్దాలు చేశారు. దీంతో ఆ ఏనుగు వెనక్కి తగ్గింది. అతడ్ని వెంబడించడం ఆపి.. తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఏనుగును ఆటంకపరిచినందుకు చివరికి అతనికి రూ.40 వేల జరిమాన వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం