AICC: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జుల్లో మార్పులు.. కర్నాటక తరహా స్ట్రాటజీ..
కర్నాటక విజయంతో టీ కాంగ్రెస్‌లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. జాతీయ నాయకత్వం సైతం తెలంగాణపై ఫోకస్ పెంచింది. తెలంగాణలో 5 పాయింట్ ఫార్ములాతో వ్యూహం సిద్ధం చేసింది. సీనియర్ల మధ్య సమన్వయం, ఆపరేషన్ ఆకర్ష్, సీనియర్ల ఘర్‌వాపసీ, చిన్నపార్టీలు, ప్రజాసంఘాలతో దోస్తీ, హామీలు, మ్యానిఫెస్టోలతో ఆకర్షణ,.. ఇలా వివిధ రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో
తెలంగాణలో ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. పార్టీలన్నీ తమతమ వ్యూహాల్లో ఉన్నాయి. ఎత్తులు పై ఎత్తులతో ఓటరుకు గాలం వేసేందకు సిద్ధమయ్యాయి. పథకాలు, హామీలు, నేతల ఎంపిక, అవసరమైన మేర నాయకత్వాల్లో మార్పు. కాంగ్రెస్ సైతం దీనిపైనే ఫోకస్ పెట్టింది. కర్నాటకలో గెలుపు వ్యూహాలు రచించిన నేతలను తెలంగాణలో దించుతుంది. రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేసింది ఏఐసీసీ. రాష్ట్ర వ్యవహారాల కో-ఇంచార్జి ఎన్ఎస్ బోసు రాజుకు కర్నాటక మంత్రిగా వర్గంలో చోటు దక్కింది. దీంతో ఆయనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించారు. నదీమ్ జావేద్‌కు వేరే బాధ్యతలు అప్పగించేందుకు ఏఐసీసీ ప్లాన్ చేస్తోంది. తెలంగాణకు కో-ఇంచార్జిలుగా కొత్తవారిని నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. బోసురాజు, నదీమ్ జావేద్ ల స్థానంలో ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్‌లను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది పార్టీ
వీరిలో పీసీ విష్ణునాథ్ ఇప్పటి వరకు కర్నాటక రాష్ట్ర వ్యవహారాల కో-ఇంచార్జిగా ఉన్నారు. అక్కడ పార్టీ విజయంలో భాగస్వామిగా ఉన్న విష్ణునాథ్ సేవలను త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో వినియోగించుకోవాలని ఏఐసీసీ భావించింది. ఆ మేరకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
కర్నాటక విజయంతో టీ కాంగ్రెస్‌లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. జాతీయ నాయకత్వం సైతం తెలంగాణపై ఫోకస్ పెంచింది. తెలంగాణలో 5 పాయింట్ ఫార్ములాతో వ్యూహం సిద్ధం చేసింది. సీనియర్ల మధ్య సమన్వయం, ఆపరేషన్ ఆకర్ష్, సీనియర్ల ఘర్‌వాపసీ, చిన్నపార్టీలు, ప్రజాసంఘాలతో దోస్తీ, హామీలు, మ్యానిఫెస్టోలతో ఆకర్షణ,.. ఇలా వివిధ రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ..