మట్టి తవ్వకాల చుట్టూ పొలిటికల్ వార్‌.. పశ్చిమగోదావరి జిల్లాలో సై అంటే సై అంటోన్న వైసీపీ, టీడీపీ నేతలు

పశ్చిమగోదావరి జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి మట్టి అమ్ముతున్న లారీలను దళితులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు.

మట్టి తవ్వకాల చుట్టూ పొలిటికల్ వార్‌.. పశ్చిమగోదావరి జిల్లాలో సై అంటే సై అంటోన్న వైసీపీ, టీడీపీ నేతలు
Nimmala Ramanaidu
Follow us
Basha Shek

|

Updated on: Jun 10, 2023 | 7:00 AM

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మట్టి తవ్వకాలపై రాజకీయ దుమారం చెలరేగింది. టీడీపీ నేత నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలకు… వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. దీంతో ఇష్యూ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి మట్టి అమ్ముతున్న లారీలను దళితులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు. అనుమతులు ఉన్నాయని చెప్పి యదేశ్చగా మట్టి అమ్ముకుంటున్న చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియాలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితులు చేస్తున్న ఆందోళనకు నిమ్మల రామానాయుడు మద్దతు ఇవ్వడంతో ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చించినాడలో మట్టి తవ్వకాలపై నిమ్మల రామానాయుడు డ్రామాలాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో వేషం వేసే డ్రామానాయుడు గురించి ప్రభుత్వం పట్టించుకోదన్నారు. అక్కడేదో దళితుల భూములు లాక్కుంటున్నట్టు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి నుంచే మట్టి తరలిస్తుంటే నిమ్మల రాజకీయం చేస్తున్నారని ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు నిర్మలకు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ కౌంటర్‌ ఇచ్చారు. అనధికారిక మట్టి తవ్వకాలు, ఆక్రమ తవ్వకాలు పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కడా జరగడంలేదని తెలిపారు. ప్రభుత్వ భూమిలోని మట్టిని మాత్రమే జగనన్న కాలనీలకు తరలిస్తున్నారన్నారు. తాము ఎక్కడన్న అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. గతంలో రామానాయుడు అదే మట్టిన అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు అవినీతిని నిరూపిస్తానని ఛాలెంజ్‌ చేశారు. మొత్తానికి చించినాడ మట్టి తరలింపుపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?