Miss World: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. భారత్ వేదికగా ప్రపంచ సుందరి పోటీలు.. ఎప్పుడంటే..
130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నెల రోజులు విడిది చేస్తారని వెల్లడించారు.. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడా సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి.. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశమని ఆయన వివరించారు.
మిస్ వరల్డ్ పోటీలకు భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత.. మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో.. మిస్ వరల్డ్ 2023, 71వ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది చివరిలో జరుగుతుంది. చివరిగా.. 1996లో ఈ అందాల పోటీలకు భారత్ వేదికైంది. అంటే 27ఏళ్ల తర్వాత దేశానికి మళ్లీ ప్రపంచ సుందరి ఎవరో తేల్చి చెప్పేందుకు అవకాశం దక్కింది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల నిర్వాహకులు ప్రకటన చేశారు. అయితే, ఇంకా కార్యక్రమంలో ఖచ్చితమైన తేదీలు మాత్రం ఖరారు కాలేదు.
71వ మిస్ వర్డల్ పోటీలు భారత్ వేదికగా జరుగుతాయని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నామంటూ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్, సీఈవో జులియా మోర్లే వెల్లడించారు. 130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నెల రోజులు విడిది చేస్తారని వెల్లడించారు.. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడా సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి.. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశమని ఆయన వివరించారు.
View this post on Instagram
ఈ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి మాట్లాడుతూ..‘భారతదేశం అంటే ఏమిటో.. మన వైవిధ్యం ఏమిటో చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా సోదరీమణులందరినీ భారతదేశానికి స్వాగతించి, వారిని కలవడానికి నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు భారతదేశంలో ఇక్కడ ఉత్తమ సమయాన్ని కలిగి ఉన్నారని నేను ఆశిస్తున్నాను’ అని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..