AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: ఒకటి రెండు కాదు.. ఏడాదిలో 51 వేల సార్లు రైల్వే సిగ్నల్ ఫెయిల్ ఘటనలు..అసలు లెక్కలు తెలిస్తే..

ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో గతంలో కూడా తరచుగా లోపాలు జరిగాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒడిశాలోని బాలసోర్ ఘటనతో ఇప్పుడు అనేక అంశాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి.  ఆటోమేటిక్ అనే రైల్వే ఇంటర్‌లాకింగ్ సిగ్నల్ సిస్టమ్‌లో పెద్ద ఎత్తున అవాంతరాలు తెరపైకి వస్తున్నాయి. రైల్వేలోని ఇంటిగ్రేటెడ్ కోచింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐసిఎస్‌ఎం)లో సిగ్నల్ వైఫల్యం గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

Odisha Train Accident: ఒకటి రెండు కాదు.. ఏడాదిలో 51 వేల సార్లు రైల్వే సిగ్నల్ ఫెయిల్ ఘటనలు..అసలు లెక్కలు తెలిస్తే..
Odisha Train Accident
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2023 | 1:33 PM

Share

ఒడిశా రైలు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఫిబ్రవరిలోనే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో లోపం ఉందని రైల్వే అధికారి ఒకరు హెచ్చరించారు. కలకలం రేపుతున్న రైల్వే అధికారి చేసిన హెచ్చరిక తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు సదరు అధికారి లేఖ రాసి వార్నింగ్ ఇచ్చారు. ప్రాథమిక విచారణలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో గతంలో కూడా తరచుగా లోపాలు జరిగాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒడిశాలోని బాలసోర్ ఘటనతో ఇప్పుడు అనేక అంశాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి.  ఆటోమేటిక్ అనే రైల్వే ఇంటర్‌లాకింగ్ సిగ్నల్ సిస్టమ్‌లో పెద్ద ఎత్తున అవాంతరాలు తెరపైకి వస్తున్నాయి. రైల్వేలోని ఇంటిగ్రేటెడ్ కోచింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐసిఎస్‌ఎం)లో సిగ్నల్ వైఫల్యం గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

గణాంకాల ప్రకారం, గత సంవత్సరంలో 51 వేల 238 సార్లు సిగ్నల్స్ ఫేయిల్‌ అయినట్టుగా సమాచారం. దేశంలోని మొత్తం 17 జోన్లలోని రైల్వే సెక్షన్లలో ఏప్రిల్ నెలలోనే 4506 సిగ్నల్స్ ఫెయిల్యూర్ ఘటనలు నమోదయ్యాయి. కొత్తగా నిర్మించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లో ఏప్రిల్ నెలలో 374 సిగ్నల్స్ విఫలమయ్యాయి. మరోవైపు, లక్నో, మొరాదాబాద్, ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజన్‌లతో కూడిన ఉత్తర రైల్వేలో గరిష్టంగా 1127 సిగ్నల్ వైఫల్యాలు ఉన్నాయి. వీటిలో ఐదు జోన్లను రెడ్ జోన్‌లో ఉంచారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతి నెల జోన్ల వారీగా నివేదికను సిద్ధం చేస్తుంది.

నివేదిక ప్రకారం, ఒక సంవత్సరంలో దేశవ్యాప్తంగా విఫలమైన సిగ్నల్స్ గణాంకాలను చూస్తే మీరు షాక్ అవుతారు. 2022 మేలో 5016, జూన్‌లో 4754, జూలైలో 5204, ఆగస్టులో 4346, సెప్టెంబర్‌లో 4548, అక్టోబర్‌లో 4340, నవంబర్‌లో 3900, డిసెంబర్‌లో 3925, జనవరి 2023లో 3605, ఫిబ్రవరిలో 3181, ఫిబ్రవరిలో 3914, మార్చిలో 3914 ఫెయిల్యూర్‌ ఘటనలు ఉన్నాయి. ప్రతి నెలా రైల్వే సిగ్నల్ వైఫల్యం ఘటన తెరపైకి వస్తోంది.

ఇవి కూడా చదవండి