AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహం జరిగింది.. కూతురుని పంపించడానికి అల్లుడికి మూడు షరతులు పెట్టిన మామ.. చివరికి ఊహించని పరిణామం

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధుమైన ఘట్టం. వివాహం అయ్యాక పిల్ల పాపలతో సంతోషంగా కలిసి ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే సాధరణంగా తల్లిదండ్రులు తమ కూతురు లేదా కొడుకుకి పెళ్లి చేయాలనుకున్నప్పడు వాళ్లని చేసుకోబోయే వాళ్ల కుటుంబం మంచి చెడ్డల గురించి ఇతరుల ద్వారా తెలుసుకుంటారు.

వివాహం జరిగింది.. కూతురుని పంపించడానికి అల్లుడికి మూడు షరతులు పెట్టిన మామ.. చివరికి ఊహించని పరిణామం
Newly Married Couple
Aravind B
|

Updated on: Jun 10, 2023 | 2:00 PM

Share

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధుమైన ఘట్టం. వివాహం అయ్యాక పిల్ల పాపలతో సంతోషంగా కలిసి ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే సాధరణంగా తల్లిదండ్రులు తమ కూతురు లేదా కొడుకుకి పెళ్లి చేయాలనుకున్నప్పడు వాళ్లని చేసుకోబోయే వాళ్ల కుటుంబం మంచి చెడ్డల గురించి ఇతరుల ద్వారా తెలుసుకుంటారు. అలాగే ఆ అబ్బాయి లేదా అమ్మాయి వ్యక్తిత్వం గురించి ఆరాతీస్తారు. చివరికి వాళ్లకి నచ్చితే పెళ్లికి ఓకే చెప్పేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ వధువు తండ్రి పెట్టిన షరతులకు వరుడు కంగుతున్నాడు. వెంటనే పెళ్లిని రద్దు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఝూన్సి జిల్లాలోని బరువసాగర్‌లోని మన్వేంద్ర అనే వ్యక్తికి జ్యోతి అనే అమ్మాయితో వివాహం కుదిరింది. జూన్ 6న వారి పెళ్లి కూడా ఘనంగా నిర్వహించారు. వివాహం అనంతరం రాత్రికి వధు, వరులు కుటుంబీకులు ఎంజాయ్ చేశారు.

జూన్ 7న నూతన వధువరులకు వీడ్కోలు పలికేందుకు రిసెప్షన్ పెట్టుకున్నారు. ఈ వేడుక జరుగుతున్న క్రమంలో వధువు సవతి తండ్రి మూడు వింత షరతులు వరుడి ముందు పెట్టాడు. అందులో మొదటి షరతు ఏంటంటే.. పెళ్లికొడుకు, పెళ్లికూతురు శారీరక సంబంధం పెట్టుకోకూడదు. రెండో షరతు ఏంటంటే.. వధువు చెల్లెలు కూడా ఆమెతోనే వరుడి ఇంటికి వచ్చి ఉంటుంది. ఇక మూడో షరతేంటంటే ఆ వధువు సవతి తండ్రి ఎప్పుడైనా ఆమె అత్త మామల ఇంటికి వస్తాడు. అతను రాకుండా ఎవరూ అడ్డుచెప్పకూడదు. ఈ మూడు షరతులను విని వరుడు ఒక్కసారిగా షాకయ్యాడు. వీటిని అంగీకరించేందుకు ఒప్పుకోలేదు.

అప్పటిదాక పెళ్లి సంబరాలతో సంతోషంగా ఉన్న క్షణాలు ఒక్కసారిగా మారిపోయాయి. చివరికి రిసెప్షన్ అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లికూతురు వరుడి ఇంటికి వెళ్లలేదు. తన చెల్లెలు, తండ్రితో ఇంటికి తిరిగి వచ్చేసింది. అక్కడున్న బంధు మిత్రులు ఇది చూసి ముక్కున వేలేసుకున్నారు. ఆ తర్వాత  వరుడు, తన కుటుంబ సభ్యులు కలిసి పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి వేడుక కోసం దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేశామని.. అలాగే రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు వధువుకి పెట్టామని తెలిపారు. పెళ్లి జరిగిన అనంతరం వధువు తండ్రి తన కూతురికి పెట్టిన నగలను కూడా తీసుకెళ్లాడని చెప్పారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి