కొబ్బరిపువ్వును దానికి వచ్చిన మొలకగా చెబుతారు. ఇది మొలకెత్తిన కొబ్బరికాయగా అభివృద్ధి చెందుతుంది. పెంకు లోపల ఉన్న విత్తనం మొలకెత్తిన తర్వాత, అది కొబ్బరి నీటిని గ్రహించి, ఘనమైన స్పాంజ్ లా పెరుగుతుంది. దీనిని కొబ్బరిపువ్వు, కొబ్బరి పిండం, కొబ్బరి యాపిల్ అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు. ఒకవేళ మీ కొబ్బరికాయలో కొబ్బరిపువ్వు వస్తే దీనిని హాయిగా తినేయొచ్చు.