బెల్లం నీళ్లు తయారు చేసుకోవడం.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోని అందులో బెల్లం ముక్క వేసి బాగా కలపాలి. ఈ హెల్తీ డ్రింక్ ను ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని రోజూ తాగాలి. ఇలా చేస్తుంటే కొన్ని నెలల్లో బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది..శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బెల్లం నీళ్లలో కలిపి తాగకూడదనుకుంటే తిన్న తర్వాత నీళ్లు తాగొచ్చు. ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల పొట్ట కూడా క్లియర్ అవుతుంది. ఇది కాకుండా బెల్లం రోటీ, బెల్లం చిక్కి, బెల్లం ఖీర్, పాయసం, బెల్లం టీ వంటి ఆరోగ్యకరమైన వాటిని కూడా తినవచ్చు.