Amazon Forest: అమెజాన్ అడవిలో తప్పిపోయిన పిల్లలు.. 40 రోజుల తర్వాత ఆచూకీ లభ్యం
ఇటీవల కొలంబియన్ అమెజాన్ రెయిన్ ఫారెస్టులో ఓ చిన్న విమానం కూలిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో ముగ్గరు చనిపోగా మరో నలుగురు పిల్లలు బతికారు. కానీ వారి ఆచూకి మాత్రం దొరకలేదు. ఈ ప్రమాదం జరిగి 40 రోజులు జరిగినప్పటికీ వారి కోసం సిబ్బంది వెతుకుతూనే ఉన్నారు.
ఇటీవల కొలంబియన్ అమెజాన్ రెయిన్ ఫారెస్టులో ఓ చిన్న విమానం కూలిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో ముగ్గరు చనిపోగా మరో నలుగురు పిల్లలు బతికారు. కానీ వారి ఆచూకి మాత్రం దొరకలేదు. ఈ ప్రమాదం జరిగి 40 రోజులు జరిగినప్పటికీ వారి కోసం సిబ్బంది వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ నలుగురు పిల్లల్ని గుర్తించారు. ఈ విషయాన్ని కొలంబియన్ అధ్యక్షుడు గుట్సావో పెట్రో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.
ఇదిలా ఉండగా మే 1 న సెస్నా 206 అనే చిన్న విమానంలో పైలట్‌తో సహా నలుగురు పిల్లలు, వారి తల్లి, బంధువు మొత్తం 7 బయలుదేరారు. వారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్ కావడంతో అమెజాన్ విమానం ఫారెస్టులో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో తల్లి, బంధువు, పైలట్ మృతి చెందారు. కానీ నలుగురు పిల్లలు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న సైనికులు ముగ్గురి మృత దేహాలను గుర్తించారు. అనంతరం ఆ చిన్నారుల కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు 40 రోజుల పాటు ఆ పిల్లలు అడవిలోనే తిరుగుతూ రోజులు గడిపారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి ఆచూకి దొరకడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..