ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఎడిక్ట్‌ అయిన బాలిక.. 4 నెలల్లో ఫ్యామిలీ సేవింగ్స్ ను ఖర్చు చేయడంతో లబోదిబోమన్న తల్లి..

నాలుగు నెల‌ల్లో కుటుంబం దాచుకున్న సొమ్మునంతటినీ మొబైల్‌గేమ్స్‌కు త‌గ‌లేసింది ఓ విద్యార్థిని. అంతేకాదు తాను చెడ్డ కోతి వనం అంతా చెరిచిందంట.. అదే విధంగా తాను చెడింది కాకుండా.. తన తోటి క్లాస్‌మేట్స్ ని కూడా గేమ్స్ ఆడడం కోసం తానే చెల్లింపులు చేసింది ఇంట్లో డెబిట్ కార్డు క‌నిపించ‌డంతో దాన్ని త‌న స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నాన‌ని, దాని పాస్‌వ‌ర్డ్‌ త‌ల్లి త‌న‌కు చెప్పింద‌ని బాలిక చెప్పింది.

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఎడిక్ట్‌ అయిన బాలిక..   4 నెలల్లో ఫ్యామిలీ సేవింగ్స్ ను ఖర్చు చేయడంతో లబోదిబోమన్న తల్లి..
Online Gaming
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2023 | 9:50 AM

చైనాకు చెందిన 13 ఏళ్ళ టీనేజ్‌ బాలిక మొబైల్‌ గేమ్స్ కారణంగా తల్లి ఖాతాలోని మొత్తం సొమ్మును ఊడ్చేసింది. స్కూల్‌లో ఎక్కువసేపు ఫోన్‌లో గడుపుతున్న బాలికను విచారించగా విషయం బైటపడింది. పే టు ప్లే గేమ్స్‌కు బాలిక అడిక్ట్‌ అయిందని గుర్తించిన టీచ‌ర్ బాలిక త‌ల్లిని అప్ర‌మ‌త్తం చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయింది. వెంటనే బాలిక త‌ల్లి యివాంగ్‌ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా అందులో కేవ‌లం 5 యువాన్లు మాత్రమే మిగలడంతో లబోదిబో మంది. కేవలం 4 నెలల్లో మొబైల్ గేమ్‌ల కోసం మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 52 లక్షలు ఖర్చు చేసిందని తెలిసి షాక్ తిన్నది ఆ తల్లి.

నాలుగు నెల‌ల్లో కుటుంబం దాచుకున్న సొమ్మునంతటినీ మొబైల్‌గేమ్స్‌కు త‌గ‌లేసింది ఓ విద్యార్థిని. అంతేకాదు తాను చెడ్డ కోతి వనం అంతా చెరిచిందంట.. అదే విధంగా తాను చెడింది కాకుండా.. తన తోటి  క్లాస్‌మేట్స్ ని కూడా గేమ్స్ ఆడడం కోసం తానే చెల్లింపులు చేసింది ఇంట్లో డెబిట్ కార్డు క‌నిపించ‌డంతో దాన్ని త‌న స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నాన‌ని, దాని పాస్‌వ‌ర్డ్‌ త‌ల్లి త‌న‌కు చెప్పింద‌ని బాలిక చెప్పింది. ఇంకో షాకింగ్‌ విషయం ఏంటంటే త‌ల్లికి అనుమానం రాకుండా త‌న స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ గేమ్స్ లావాదేవీల‌కు సంబంధించిన, మెసేజ్‌లు, ఇతర రికార్డులు అన్నింటినీ డిలీట్‌ చేసింది.

అయితే తన సహవిద్యార్థులు గేమ్‌ ఆడేందుకు డబ్బు డిమాండ్ చేశారనీ, వారికి పంపకపోతే, ఇబ్బంది పెట్టేవారని సదరు బాలిక వెల్లడించింది. అలాగే టీచర్‌కి చెబితే టీచర్ తన పేరెంట్స్‌కికి చెబితే, వారికి కోపం వస్తుందేమోనని భయపడినట్టు చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గేమింగ్‌ యాప్స్‌ వైపు ఆకర్షితులవుతున్న టీనేజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనాతో సహా అనేక దేశాలు గేమింగ్ వ్యసనంనుంచి మైనర్లను కాపాడే చర్యలను చేపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

స్మార్ట్‌ఫోన్ వ్యసనంపై 2022 మెక్‌గిల్ విశ్వవిద్యాలయ అధ్యయన విశ్లేషణ ప్రకారం..  ఆన్ లైన్ గేమింగ్ కు  ఎక్కువ మంది బానిసలుగా మారిన యువత చైనాలో ఉన్నారు. తర్వాత స్తానంలో సౌదీ అరేబియా, మలేషియాలున్నాయి. ఈ అధ్యయనంలో యునైటెడ్ స్టేట్స్ , జపాన్‌తో సహా 24 దేశాల్లో 15 నుంచి  35 సంవత్సరాల మధ్య వయస్సు గల 34,000 మందిపై అధ్యయనం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే