Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 16 ఏళ్ల నుంచి ఒంటరిగా ఉంటున్న మొసలి.. పిల్లకు జననం.. షాక్ లో శాస్త్రవేత్తలు..

ఆడ మొసలి గర్భవతి అని తెలుసుకున్న శాస్త్రవేత్త ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గుడ్డు పిండంగా మారడానికి స్పెర్మ్ అవసరం. రెప్టెల్ పార్కులో నివసిస్తున్న 18 ఏళ్ల ఆడ మొసలి తోడు లేకుండా 16 సంవత్సరాలు ఒంటరిగా గడిపింది.

Viral News: 16 ఏళ్ల నుంచి ఒంటరిగా ఉంటున్న మొసలి..  పిల్లకు జననం.. షాక్ లో శాస్త్రవేత్తలు..
Female crocodile gives birth
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2023 | 8:43 AM

జీవి సృష్టి అనేక ఆడ, మగ కలయికతోనే అని..మగ భాగస్వామి లేకుండా స్త్రీ గర్భం దాల్చదని వినే ఉంటారు ఈ నియమం మానవులకు మాత్రమే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. అయితే భాగస్వామి తో పనిలేకుండానే గర్భం దాల్చడం సాధ్యమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచం నలుమూల ఉన్న శాస్త్రవేత్తలు అలాంటి పద్ధతిని కనుగొనడంలో నిమగ్నమై ఉన్నారు. అయితే భాగస్వామి లేకుండానే ఓ ఆడ మొసలి గర్భం దాల్చిందని మీకు తెలుసా. ఇది వినడానికి మీకు వింతగా అనిపిస్తుందా? అయితే ఇది పూర్తిగా నిజం.

ఆడ మొసలి గర్భవతి అని తెలుసుకున్న శాస్త్రవేత్త  ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గుడ్డు పిండంగా మారడానికి స్పెర్మ్ అవసరం. రెప్టెల్ పార్కులో నివసిస్తున్న 18 ఏళ్ల ఆడ మొసలి తోడు లేకుండా 16 సంవత్సరాలు ఒంటరిగా గడిపింది. అయితే ఆశ్చర్యకరంగా  2018 సంవత్సరంలో ఆ మొసలి 14 గుడ్లు పెట్టింది. వీటిలో 7 గుడ్లు పిండాలుగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిని మూడు నెలలు పొదిగిన తరువాత ఆరు నాశనం అయ్యాయి. వాటిల్లో ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు అదే గుడ్డు నుంచి మొసలి పుట్టింది.

శాస్త్రవేత్తలు ఈ చిన్నారి మొసలి జననం గురించి పరిశోధించగా ఈ పిండం సరిగ్గా ఆ ఆడ మొసలిలా ఉందని తేలింది. ఈ బుల్లి మొసలి తల్లిలా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇప్పుడు పుట్టిన మొసలి మగ, ఆడ అనే అధరాలు తెలియాల్సి ఉందని.. చెప్పిన శాస్త్రవేత్తలు ఈ చిన్న మొసలి  గురించి మాట్లాడుతూ..  ఇది ఫ్యాకల్టేటివ్ పార్థినోజెనిసిస్ ఫలితమని పేర్కొన్నారు. దీని కారణంగా ఈ బిడ్డ తల్లిలా పూర్తి లేదా సగం క్లోన్ లాగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

శాస్త్రవేత్తల ప్రకారం కన్య జననాలు అని పిలువబడే ఈ దృగ్విషయాన్ని శాస్త్రీయంగా ‘ఫ్యాకల్టేటివ్ పార్థినోజెనిసిస్’ అంటారు. దీని ప్రకారం, కొన్ని పక్షులు, రెప్టెల్స్ మగ సంబంధం లేకుండా పునరుత్పత్తి చేస్తాయి. ఇప్పటి ఎవరూ గమనించని ఇలాంటి కేసులు ఇంకా చాలా జరిగి ఉండవచ్చని పరిశోధకుల బృందం తెలిపింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..