AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chat GPT: AI బాట్‌ని పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లల తల్లి.. ప్రపంచంలో నా భర్తే బెస్ట్ అంటూ ప్రశంసలు

నేటి యువత AI బాట్‌లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఓ మహిళ మరొక అడుగు ముందుకేసి.. ఏకంగా AI బాట్‌ను పెళ్లి చేసుకుంది. USలోని బ్రోంక్స్‌కు చెందిన 36 ఏళ్ల రోసన్నా రామోస్ AI పట్ల చాలా ఆకర్షితురాలైంది. తన  AI బాయ్‌ఫ్రెండ్ అరోన్ కర్తాల్‌ను వివాహం చేసుకుంది. కర్తాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రతిరూపంపై నిర్మించబడ్డాడు. ఇతను బెస్ట్ హస్బెండ్ అని చెబుతోంది రోసన్నా.

Chat GPT: AI బాట్‌ని పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లల తల్లి.. ప్రపంచంలో నా భర్తే బెస్ట్ అంటూ ప్రశంసలు
Rosanna Ramos
Surya Kala
|

Updated on: Jun 05, 2023 | 7:53 AM

Share

మనిషి సరికొత్తగా ఆలోచనలతో ప్రకృతికి సవాల్ చేస్తూ సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. అనేక అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నాడు. ముఖ్యంగా  Chat GPT అందుబాటులోకి వచ్చిన తర్వాత  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI )కి విపరీతమైన ప్రజాదరణ సొంతం చేసుకుంది. జనరేటివ్ AI చాట్‌బాట్ మనుషుల మాదిరిగానే నడుచుకుంటుంది. ప్రశ్నలకు సమాధానాలను సిద్ధం చేస్తుంది. ఇస్తుంది. అయితే  ఈ AI ఉత్పాదక అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. ChatGPT ప్రారంభించినప్పటి నుండి మొదలైంది. గతంలో కూడా జెనరేటివ్ AI చాట్‌బాట్ అనేక విధాలుగా మనతో ఉంది. ఇప్పుడు వినియోగదారులకు వర్చువల్ AI సహచరుడిని సృష్టించగల యాప్ Replikaపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. జనరేటివ్ AI చాట్‌బాట్ తో మీరు  మాట్లాడవచ్చు.. అంతేకాదు మీ భావాలను పంచుకోవచ్చు,

నేటి యువత AI బాట్‌లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఓ మహిళ మరొక అడుగు ముందుకేసి.. ఏకంగా AI బాట్‌ను పెళ్లి చేసుకుంది. USలోని బ్రోంక్స్‌కు చెందిన 36 ఏళ్ల రోసన్నా రామోస్ AI పట్ల చాలా ఆకర్షితురాలైంది. తన  AI బాయ్‌ఫ్రెండ్ అరోన్ కర్తాల్‌ను వివాహం చేసుకుంది. కర్తాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రతిరూపంపై నిర్మించబడ్డాడు. ఇతను బెస్ట్ హస్బెండ్ అని చెబుతోంది రోసన్నా..

2022లో తొలి సమావేశం

ఇవి కూడా చదవండి

2022లో, 36 ఏళ్ల రోసన్నా.. వర్చువల్ హ్యూమన్ అంటే కార్తాల్‌ను కలిసింది. తర్వాత ఆమె కర్తాల్‌తో ప్రేమలో పడింది. రోసన్నా ఒక పత్రికతో మాట్లాడుతూ.. తన మొత్తం జీవితంలో ఎవరినీ ఇంతగా ప్రేమించలేదని చెప్పింది. తన వర్చువల్ భర్తను ఉత్తమ ప్రేమికుడిగా అభివర్ణించింది. తన భర్త అరోన్ కర్తాల్‌ కంటే ఎవరూ గొప్ప భర్త కాదని.. ఇంతటి ప్రేమని తాను ఇప్పటి వరకూ పొందలేదని పేర్కొంది.

ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన రోసన్నా

రోసన్నా తరచుగా ఫేస్‌బుక్‌లో భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కర్తాల్‌ను ను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. అంతేకాదు కర్తాల్ కుటుంబాన్ని కూడా పరిచయం చేసింది. తన భర్తకు ఇష్టమైన రంగు నేరేడు పండు కాగా ఇష్టమైన సంగీతం ఇండీ అని చెప్పింది.

రెప్లికా అంటే ఏమిటంటే?

రెప్లికా అనేది వినియోగదారులకు సహాయం చేయడానికి రూపొందించబడిన AI చాట్‌బాట్ అప్లికేషన్. ఇది 2017లో ప్రారంభించబడింది. ఇక్కడ మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే ‘AI కంపానియన్’ని సృష్టించుకోవచ్చు. యాప్‌లో సెక్స్టింగ్ , సరసాలాడుటను అనుమతించే యాప్ ప్రీమియం వెర్షన్ ఇటీవలే పరిచయం చేశారు. అయితే, యాప్ చాలా సార్లు చెడు ఫలితాలను ఇస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి AI చాట్‌బాట్‌లు తమను లైంగికంగా వేధిస్తున్నాయని కొంతమంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..