Watch Video: ఏంటీ బ్రో మరి ఇంత ప్రేమనా.. కుక్క కోసం రూ.16 లక్షల ఇల్లే కట్టించేశాడు
చాలామంది తమ పుట్టినరోజును ఓ ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. బంధుమిత్రులు శుభాకాంక్షలు చెప్పడం..బహుమతులు ఇవ్వడం, కేక్ తీసుకొచ్చి కట్ చేయించడం లాంటి వల్ల ఆ రోజున వారిక మంచి అనుభూతిని కలుగుతుంది. సాధారణంగా బర్త్ డే ఉన్నప్పుడు బహుమతులు ఇవ్వడం మాములే.. డబ్బున్న వాళ్లైతే బైక్‌లు, కార్లు కూడా ఇస్తుంటారు.
చాలామంది తమ పుట్టినరోజును ఓ ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. బంధుమిత్రులు శుభాకాంక్షలు చెప్పడం..బహుమతులు ఇవ్వడం, కేక్ తీసుకొచ్చి కట్ చేయించడం లాంటి వల్ల ఆ రోజున వారిక మంచి అనుభూతిని కలుగుతుంది. సాధారణంగా బర్త్ డే ఉన్నప్పుడు బహుమతులు ఇవ్వడం మాములే.. డబ్బున్న వాళ్లైతే బైక్‌లు, కార్లు కూడా ఇస్తుంటారు. అయితే ఈ మధ్య కొంతమంది తమ పెంపుడు కుక్కలుకు కూడా బర్త్ డేలు జరుపుతున్నారు. అయితే ఓ యూట్యూబర్ మాత్రం తన పెంపుడు కుక్క కోసం దాని పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా రూ.16 లక్షల విలువైన ఓ లగ్జరీ ఇళ్లునే కట్టించేశాడు.
వివరాల్లోకి వెళ్తే బ్రెంట్ రివేరా అనే యూట్యూబర్‌కు దాదాపు 2 కోట్ల 66 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. వినూత్న కంటెంట్‌తో తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకునే రివేరా.. అతని పెంపుడు కుక్క అయిన చార్లీ పుట్టిన రోజుకు సందర్భంగా ఏదైన ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. చివరికి దానికోసం ఏకంగా రూ.16 లక్షల విలువైన ఓ లగ్జరీ ఇల్లను కట్టించాడు. ఆ ఇంట్లో ప్రత్యేకంగా ఆ కుక్క కోసం బెడ్ రూం, లీవింగ్ రూం, ఆఖరికి డ్రెస్సులు కూడా ఇన్నాయి. అలాగే బ్యాక్ యార్డును నిర్మించాడు. అంతేకాదు ఆ ఇంట్లో టీవీ కూడా ఉంది. రివేరా పనిలో ఉన్నప్పుడు ఆ కుక్క ఒంటరిగా ఉండకుండా దానితో మరొకరు ఉండేందుకు ఓ పెట్టర్‌ను కూడా నియమించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన యూట్యూబ్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన తన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెంపుకు కుక్కపై రివేరా చాటిన ప్రేమపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..