Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు పొడి ఇడ్లీపై దుమారం.. సోషల్ మీడియాలో అభిమానుల నడుమ రచ్చ..! ఏమైందంటే..

చట్నీతో కలిపి సాధారణ ఇడ్లీల ఫోటోను కూడా అతను పోస్ట్ చేశాడు. దీనికి అనుకూలంగా, వ్యతిరేకిస్తూ పలువురు కామెంట్ల రూపంలో స్పందించారు. ఇది ఆహార ప్రియుల మధ్య ఆన్‌లైన్  లో చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా రామేశ్వరంలో తాను ఇలాంటి ఇడ్లీ తిన్నానని, ఇకపై అక్కడికి వెళ్లనని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇది రామేశ్వరం స్టైల్ కాదని, ఇసుకలా తింటున్నారని ఓ మహిళ పేర్కొంది.

బెంగళూరు పొడి ఇడ్లీపై దుమారం..  సోషల్ మీడియాలో అభిమానుల నడుమ రచ్చ..! ఏమైందంటే..
Bengaluru Podi Idli
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2023 | 8:50 AM

మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్లారా..? వెళితే మీకు బెంగుళూరు ప్రసిద్ధ ఇడ్లీ కారం గురించి తెలిసే ఉంటుంది. నెయ్యిలో ముంచి, పైన మసాలా, చింతపండు చట్నీతో ఇడ్లీని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ఈ పొడిని ఇడ్లీ ప్లేట్‌లో అందిస్తారు. ఇలాంటి ప్రత్యేకమైన మసాలాకారం ఇప్పుడు హైలైట్‌గా నిలుస్తోంది. భోజన ప్రియులు ఇష్టపడే వంటలలో ఇది కూడా ఒకటి. అందుకే బెంగళూరులో పొడి ఇడ్లీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా పొడి ఇడ్లీ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా అంకిత్ టుడే అనే ట్విట్టర్ ఖాతాలో పోడి ఇడ్లీపై పలు విమర్శలు వచ్చాయి.

బెంగుళూరులో చాలా చోట్ల వడ్డించే నెయ్యితో పాటు కారం ఇడ్లీలు తనకు నచ్చవని, ‘డెత్ బై క్యాలరీలు’ నెయ్యి తనను ఎక్కువగా తినకుండా ఆపేసిందని అంకిత్ ట్వీట్ చేశాడు. స్పైసీ ఇడ్లీల కంటే వేడి, తాజా ఇడ్లీలను ఇష్టపడతానని అతను ట్వీట్‌లో పేర్కొన్నాడు. చట్నీతో కలిపి సాధారణ ఇడ్లీల ఫోటోను కూడా అతను పోస్ట్ చేశాడు. దీనికి అనుకూలంగా, వ్యతిరేకిస్తూ పలువురు కామెంట్ల రూపంలో స్పందించారు. ఇది ఆహార ప్రియుల మధ్య ఆన్‌లైన్  లో చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా రామేశ్వరంలో తాను ఇలాంటి ఇడ్లీ తిన్నానని, ఇకపై అక్కడికి వెళ్లనని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇది రామేశ్వరం స్టైల్ కాదని, ఇసుకలా తింటున్నారని ఓ మహిళ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ప్రజలు దీన్ని తినడానికి క్యూలో నిల్చుని ఉండటం పట్ల తాను జాలిపడుతున్నాను అని కూడా అతను వ్యాఖ్యానించారు. పొడి ఇడ్లీ అనేది ఒక రుచికరమైన వంటకం, ఇది సాధారణంగా సుదీర్ఘ ప్రయాణాల్లో అనుకూలంగా ప్యాక్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. పొడి ఇడ్లీలు చేయడానికి మినీ ఇడ్లీలను ఉపయోగించవచ్చు. నెయ్యి, ఈ ప్రత్యేక కారంతో ఈ పొడి ఇడ్లీ కాంబో ప్యాక్‌. పొడి ఇడ్లీ, ఇడ్లీ పొడిలో ఇడ్లీలపై నువ్వుల నూనె లేదా నెయ్యితో అందిస్తారు.. దీనిని సాధారణంగా ఇడ్లీకి చట్నీగా ఉపయోగిస్తారు. దక్షిణ భారతీయ వంటకాలలో ఈ ప్రత్యేకమైన ఇండ్లీ కారాన్ని భోజనప్రియులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఇకపోతే, సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇప్పటి కే ఈ పోస్ట్‌ 77వేల వ్యూస్‌ సాధించింది. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో ఆహార ప్రియుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..