Video Viral: ప్రపోజ్ కోసం లవర్ ప్రయత్నం చివరికి ఫన్నీగా మారిపోయింది.. నవ్వులు పూయిస్తున్న వీడియోపై లుక్ వేయండి..
ఏ యువకుడికైనా తన ప్రేమను తన ప్రేయసికి వ్యక్తపరచడం జీవితంలోని అందమైన క్షణాలలో ఒకటి అని మనందరికీ తెలుసు. ఈ కారణంగానే యువకులు తమ జీవితంలో ప్రత్యేకంగా మార్చుకోవడానికి డిఫరెంట్ ప్రదేశాలను ఎంచుకుంటారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టెయ్యవచ్చు. ఇంటర్నెట్ లో రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. జంతువులు, పక్షులు, వింతలు, వినోదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా ఆకర్షించేవి ఫన్నీ వీడియోలు. వీటిని చూడటమే కాకుండా ఒకరితో ఒకరు షేర్ చేస్తూ సందడి చేస్తారు. అలాంటి వీడియో ఒకటి ఈ రోజుల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.
ఏ యువకుడికైనా తన ప్రేమను తన ప్రేయసికి వ్యక్తపరచడం జీవితంలోని అందమైన క్షణాలలో ఒకటి అని మనందరికీ తెలుసు. ఈ కారణంగానే యువకులు తమ జీవితంలో ప్రత్యేకంగా మార్చుకోవడానికి డిఫరెంట్ ప్రదేశాలను ఎంచుకుంటారు. ఎప్పటికీ జ్ఞాపకం ఉండేలా చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి చేసే ప్రయత్నాలను ఫన్నీగా ఉంటాయి. ఒకొక్కసారి తమ ప్రేమని వ్యక్తం చేసే సందర్భంగా చేసిన ప్లాన్ చెడిపోతుంది.
ఇక్కడ వీడియో చూడండి:
Great marriage proposal ?? pic.twitter.com/CdtH9l9NZw
— CCTV IDIOTS (@cctvidiots) May 25, 2023
ఓ అబ్బాయి తన ప్రేయసికి పెళ్లి ప్రపోజ్ చేయబోతున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు వేదికగా నదిలోని పడవను ఎంచుకున్నాడు. టైటానిక్ లో లవర్స్ పోజులో సరదాగా ఫన్నీగా గడుపుతూ.. యువకుడు తన ప్యాంట్ జేబులోంచి ఉంగరాన్ని తీయబోయాడు. తన జేబులో నుండి ఉంగరాన్ని తీస్తుండగా.. ఉంగరం బాక్స్ కింద పడిపోయింది. ఇదంతా చూసిన ప్రియురాలు మరింత ఆశ్చర్యపోయింది. రింగ్ ఉన్న బాక్స్ నదిలో పడిపోతుంటే.. ఆ రింగ్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తూ.. నదిలో పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. లైక్స్ తో హోరెత్తిస్తున్నారు.
@cctvidiots అనే ఖాతాలో ఈ వీడియో Instagramలో షేర్ చేశారు. 70 లక్షలకు పైగా వ్యూస్ ను అనేక రకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ‘ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత నేను నవ్వుని ఆపుకోలేకపోయాను అని ఒకరు అంటే.. మరొకరు, ‘స్పెషల్ గా ప్రపోజ్ చేయాలనుకున్నావు.. ఆట అయ్యింది కదా అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..