AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రమాదకరమైన కొండపై బైక్ నడుపుతున్న యువతి.. క్షణం అటు ఇటుకైతే ప్రాణాలు గాల్లోకే.. షాకింగ్ వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో.. ఎరుపు రంగు జాకెట్ ధరించిన యువతి బైక్‌పై కూర్చొని ఉంది. మరు క్షణం కెమెరా కోణం మారుతుంది. బైక్ కంట్రోల్ చేస్తున్న తీరు చూస్తే ఎవరైనా షాక్ తింటారు. ఒక యువతి యూ టర్న్స్ తో నిండిన ఒక ఎత్తైన కొండ మీద ఉన్న వంకర రోడ్డు మీద బైక్ మీద నుంచి కిందకు దిగడానికి ప్రయాణిస్తుంది.

Viral Video: ప్రమాదకరమైన కొండపై బైక్ నడుపుతున్న యువతి.. క్షణం అటు ఇటుకైతే ప్రాణాలు గాల్లోకే.. షాకింగ్ వీడియో వైరల్
Video Viral
Surya Kala
|

Updated on: May 26, 2023 | 1:18 PM

Share

ఈ రోజుల్లో ఓ యువతి బైక్ నడుపుతున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి, వైరల్ క్లిప్‌లో యువతి బైక్ నడుపుతున్న ప్రదేశం చూస్తే ఎవరైనా షాక్ తింటారు. ఈ మహిళ బైక్‌పై నియంత్రణ కోల్పోయి ఉంటే.. ఆమె నేరుగా లోతైన లోయలో పడిపోతుంది.. ఇది వీడియోలో చూడవచ్చు . ఈ వీడియో చూసిన వారి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఎరుపు రంగు జాకెట్ ధరించిన యువతి బైక్‌పై కూర్చొని ఉంది. మరు క్షణం కెమెరా కోణం మారుతుంది. బైక్ కంట్రోల్ చేస్తున్న తీరు చూస్తే ఎవరైనా షాక్ తింటారు. ఒక యువతి యూ టర్న్స్ తో నిండిన ఒక ఎత్తైన కొండ మీద ఉన్న వంకర రోడ్డు మీద బైక్ మీద నుంచి కిందకు దిగడానికి ప్రయాణిస్తుంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా బైక్‌తో పాటు ఆ యువతి  వందల అడుగుల మేర లోతులో పడిపోయే అవకాశం ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే ఈ వీడియో ఎక్కడిది అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. అయితే వైరల్ క్లిప్ పై నెటిజన్లు వివిధ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @rising.tech అనే ఐడీ లో వీడియో షేర్ చేశారు. అంతేకాదు  మీరు కూడా ఇక్కడ బైక్‌ను నడపాలనుకుంటున్నారా అని క్యాప్షన్ ఇచ్చారు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు ఆరు వేలకు పైగా లైక్స్ రావడంతో నెటిజన్లు షాక్ తింటూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

మహిళ బైక్ నడుపుతున్న ప్రదేశానికి కేవలం ఒక అడుగు దూరంలో స్వర్గానికి వెళ్లే మార్గం ఉందని ఒకరు వ్యాఖ్యానిస్తే.. అదే సమయంలో, మరొకరు బ్రదర్… చనిపోవడానికి వేల మార్గాలు ఉన్నాయి. దానికి ఈ వీడియో ఒక మార్గం మాత్రమే అని వ్యాఖ్యానిస్తే.. ఆమె ఒక మహిళ.. స్త్రీ కూడా తలచుకుంటే ఏదైనా చేయగలదని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..