Snake Video Viral: తన శరీరాన్ని తానే కొరికేసుకున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్
అయితే ఈ జీవి తనను తాను కొరుకుకోవడం ప్రారంభిస్తే? వినడానికి వింతగా అనిపించవచ్చు.. అయితే ఈ విషయం పూర్తిగా నిజం. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక పాము తనను తాను కాటు వేసుకోవడం కనిపిస్తుంది.
ప్రస్తుతం ఎక్కువమందికి స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు, తద్వారా తమ ఒత్తిడిని ఏదో ఒక విధంగా తగ్గించుకోవచ్చనని భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఫన్నీ, నవ్వించే వీడియోలు మాత్రమే కాదు రకాల వీడియోలు కనిపిస్తాయి. అదే సమయంలో కొన్ని రకాల వీడియోలు చూస్తే షాక్ తింటాం.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూసిన ఎవరైనా ఆశ్చర్యపోతారు.
పాము చిన్నదైనా, పెద్దదైనా.. దాన్ని చూసిన ఎవరైనా భయపడతారు. జంతువులు, మానవులు కూడా పాములకు దూరంగా పారిపోతారు. అయితే ఈ జీవి తనను తాను కొరుకుకోవడం ప్రారంభిస్తే? వినడానికి వింతగా అనిపించవచ్చు.. అయితే ఈ విషయం పూర్తిగా నిజం. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక పాము తనను తాను కాటు వేసుకోవడం కనిపిస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో తెగిపడిన పాము తల, మొండెం విడివిడిగా పడి ఉండడాన్ని మీరు చూడవచ్చు. దీన్ని చూస్తే ఎవరో దారుణంగా హత్య చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. మొండెం వేదనతో కదులుతూ పక్కనే పడి ఉన్న పాము తలని తాకింది. అప్పుడు ఆ పాము తల తన బాడీని కోరలతో కొరికింది. వెంటనే ఆ పాము శరీరం బాధతో విలవిలా కదిలింది. ఈ దృశ్యం చూస్తుంటే రెండు పాములు ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటున్నట్లు అనిపిస్తోంది. రెండు పాము ముక్కలు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి ఇది ఒకే పాము. మొండెం, తల కింద విడిపోయి ఉంది. ఈ రెండు ఒకదాటితో ఒకటి పోట్లాడుకోవడం కనిపిస్తుంది.
Watch as decapitated snake bites it’s own body ? pic.twitter.com/lIneCEZvfU
— OddIy Terrifying (@OTerrifying) May 2, 2023
ఈ వీడియో @OTerrifying అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. వార్తలు రాసే వరకు ఈ క్లిప్ కోటి కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రజలు దానిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..