AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spider Bite: కుట్టింది సాలీడు కదా అనుకుంది.. చివరికి కాలు పోగొట్టుకుని వికలాంగురాలైన మహిళ..

వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ సాలీడు క్రిస్టల్ జోసెఫ్ కాలుపై కాటు వేసింది. అయితే ఆ సమయంలో చిన్నదే కదా... సాలీడు కరిస్తే ఏమి జరుగుతుందిలే అంటూ నిర్లక్ష్యంగా ఉండిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత సాలీడు ఎక్కడ కరిచిందో.. అక్కడ ఆమెకు ఇబ్బంది మొదలైంది.

Spider Bite: కుట్టింది సాలీడు కదా అనుకుంది.. చివరికి కాలు పోగొట్టుకుని వికలాంగురాలైన మహిళ..
Spider Bite
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2023 | 12:42 PM

కొన్ని విషయాలు మనం చాలా చిన్నవిగా వదిలేస్తాం.. అయితే ఈ చిన్న విషయాలు ఎవరూ ఆలోచించలేని విధంగా మన జీవితం పై ప్రభావాన్ని చూపిస్తాయి. చిన్న నిర్లక్ష్యంతో ఒకొక్కసారి జీవితంలో విలువైన వాటిని కోల్పోవచ్చు కూడా..ఒక మహిళను సాలీడు కాటు వేసింది. అయితే కరిచింది సాలీడే కదా అంటూ దానిని తేలికగా తీసుకుంది. తత్పలితంగా ఆ యువతి ఇప్పుడు తన ఒక కాలుని కోల్పోయింది. ఈ షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసిస్తున్న క్రిస్టల్ జోసెఫ్ అనే మహిళ విషయంలో జరిగిన విషయం గురించి తెలిసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి లోనైంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ సాలీడు క్రిస్టల్ జోసెఫ్ కాలుపై కాటు వేసింది. అయితే ఆ సమయంలో చిన్నదే కదా… సాలీడు కరిస్తే ఏమి జరుగుతుందిలే అంటూ నిర్లక్ష్యంగా ఉండిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత సాలీడు ఎక్కడ కరిచిందో.. అక్కడ ఆమెకు ఇబ్బంది మొదలైంది.

వికలాంగురాలిని చేసిన స్పైడర్

ఇవి కూడా చదవండి

రోజు రోజుకీ సాలీడు కాటు వేసిన అరికాలు తిమ్మిరి ఎక్కడం.. తీవ్రమైన బాధ పెట్టడం మొదలు పెట్టింది.  బాధ అధికం కావడంతో క్రిస్టల్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడ ఆమె పాదాలను పరీక్షించిన డాక్టర్ షాక్ తిన్నది. ఎందుకంటే ఆమె పాదాల అరికాళ్ళను కరిచింది తెల్ల తోక గల సాలీడు.. ఇప్పుడు ఆమె కాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురైంది. ఈ ఇన్ఫెక్షన్ క్రమంగా మొత్తం కాలుకు పాకుతుందని డాక్టర్ చెప్పారు. అంతేకాదు.. సరైన సమయంలో కాలిని కట్ చేసి తీసెయ్యకపోతే.. ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతటా వేగంగా వ్యాపించి ప్రాణాలకు ప్రమాదం కావొచ్చని హెచ్చరించారు డాక్టర్.

డాక్టర్ చెప్పింది విన్న తర్వాత క్రిస్టల్ తాను ప్రాణాలతో ఉండాలంటే.. కాలు తొలగించుకోవడం తప్ప వేరే దారి లేదని నిర్ణయం తీసుకుంది. చివరకు శస్త్రచికిత్స చేయించుకుని.. ఒక కాలుని శాశ్వతంగా తొలగించుకుంది. ఈ ఆపరేషన్ తర్వాత కూడా..క్రిస్టల్ జోసెఫ్ కి సాలీడు కరిచిన కాలులో మిలిగిన భాగంలో ఇప్పటికీ తీవ్ర మైన నొప్పి, తిమ్మిరిని అనుభవిస్తూనే ఉంటుంది. ఇదే విషయం గురించి బాధితురాలు  డాక్టర్‌తో చెప్పినప్పుడు.. ఆమె టైప్ 1 డయాబెటిస్ పేషెంట్ అని, భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పింది. ప్రస్తుతం, ఆమె తన కొత్త కృత్రిమ కాలు సహాయంతో తన కొత్త జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.
అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.
TTD ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీగా విరాళాలు..రూ.2 కోట్లు అందజేత!
TTD ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీగా విరాళాలు..రూ.2 కోట్లు అందజేత!
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ..
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ..
భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం
భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం
మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్‌..పర్యాటకులు ఏమంటున్నారంటే!
మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్‌..పర్యాటకులు ఏమంటున్నారంటే!
విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత..
విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత..
కర్రెగుట్టల్లో తుపాకుల మోత.. సీఎం రేవంత్, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కర్రెగుట్టల్లో తుపాకుల మోత.. సీఎం రేవంత్, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Video: లైవ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో గొడవకు దిగిన కింగ్ కోహ్లీ
Video: లైవ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో గొడవకు దిగిన కింగ్ కోహ్లీ
తెలంగాణలో భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్!
తెలంగాణలో భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్!
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..