AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fired from Job: రోజుకు 6 గంటలు టాయిలెట్లోనే గడిపే ఉద్యోగి.. వేటు వేసిన కంపెనీ.. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన…

విధి నిర్వహణ సమయంలో వాంగ్ దాదాపు రోజుకు 6 గంటల పాటు టాయిలెట్ లో గడుపుతున్నట్టు గుర్తించారు. ఒకసారి టాయిలెట్ లోకి వెళ్లాడంటే ఒక్కోసారి 3 గంటల సమయం పాటు బయటికి రాడు. ఇది ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమని, సదరు ఉద్యోగిని విధుల్లో కొనసాగించలేమంటూ వేటు వేసింది. అయితే ఉద్యోగం ఇప్పించి మరుగుదొడ్డిలో గడిపేందుకు కూడా జీతం కావాలని ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు.

Fired from Job: రోజుకు 6 గంటలు టాయిలెట్లోనే గడిపే ఉద్యోగి.. వేటు వేసిన కంపెనీ.. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన...
Man In China
Surya Kala
|

Updated on: Jun 03, 2023 | 8:58 AM

Share

ఓ ఉద్యోగి ఆఫీసుకు వచ్చి విధి నిర్వహణ కాకుండా, ఇతర పనులు చేస్తుంటే ఏ కంపెనీ యాజమాన్యానికైనా చిర్రెత్తుకొస్తుంది. చైనాలోని వాంగ్ అనే ఉద్యోగి ఆఫీసుకు వచ్చి గంటల తరబడి టాయిలెట్ లో గడపడంతో యాజమాన్యం మండిపడింది. విధి నిర్వహణ సమయంలో వాంగ్ దాదాపు రోజుకు 6 గంటల పాటు టాయిలెట్ లో గడుపుతున్నట్టు గుర్తించారు. ఒకసారి టాయిలెట్ లోకి వెళ్లాడంటే ఒక్కోసారి 3 గంటల సమయం పాటు బయటికి రాడు. ఇది ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమని, సదరు ఉద్యోగిని విధుల్లో కొనసాగించలేమంటూ వేటు వేసింది. అయితే ఉద్యోగం ఇప్పించి మరుగుదొడ్డిలో గడిపేందుకు కూడా జీతం కావాలని ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. తనకు మలద్వార సమస్య ఉందని, ఈ కారణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉద్యోగి కోర్టును కోరాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

అనారోగ్య సమస్యల కారణంగా మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తున్నానని, తన సమస్యను పరిగణలోకి తీసుకుని ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఉద్యోగి ఇంటి పేరు మాత్రమే బయటకు వచ్చింది. వాంగ్ అని తెలిసింది. అతను ఏప్రిల్ 2006లో ఉద్యోగంలో చేరాడు. 2014 డిసెంబర్‌లో మలవిసర్జన సమస్య ఏర్పడిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. దానికి చికిత్స కూడా తీసుకున్నాడు. కంపెనీ రికార్డుల ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 17, 2015 మధ్య, వాంగ్ తన షిఫ్ట్ సమయంలో రెండు మూడు సార్లు టాయిలెట్‌కు వెళ్లేవాడు. అతను ఈ 10 రోజుల్లో 22 సార్లు 44 నిమిషాల నుండి 3 గంటల వరకు టాయిలెట్ లోనే ఉండడానికి సమయం తీసుకున్నాడు. దీంతో కంపెనీ అతడిని 2015 సెప్టెంబర్ 23న ఉద్యోగం నుంచి తొలగించింది. కంపెనీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాంగ్ కోర్టును ఆశ్రయించాడు. తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కోరాడు.

అయితే కోర్టు కంపెనీకే మద్దతుగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతూ అధిక సమయం పాటు టాయిలెట్ లో ఉంటే విధి నిర్వహణ కుంటుపడుతుంది కదా అని ఆ ఉద్యోగి తీరు పట్ల కోర్టు వ్యాఖ్యానించింది. విధులు 8 గంటలు అయితే, 6 గంటలు టాయిలెట్లోనే గడిపితే డ్యూటీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించింది. వాంగ్ ఎక్కువసేపు టాయిలెట్లోనే గడపడంపై కంపెనీ తగిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. దాంతో న్యాయస్థానం ఆ ఉద్యోగికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ కంపెనీలో ఉద్యోగానికి అనర్హుడని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నాడని, మరుగుదొడ్డిలో గడపడానికి కూడా జీతం అడుగుతున్నట్లుగా సదరు ఉద్యోగి తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంత మంది కంపెనీ సరైన పని చేసిందని, ఉద్యోగం చేసే తీరుకు ఓపిక లేనప్పుడు కంపెనీ జీతం ఎలా ఇస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..