AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maternity Leave: ఒకేసారి ప్రెగ్నెంట్స్ అయిన 3 మహిళా ఉద్యోగులు.. కుదరదంటూ బాస్ కోపం.. నెట్టింట్లో వైరల్

కుటుంబ నియంత్రణ అనేది భార్యాభర్తల మధ్య పరస్పర విషయం. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ ఉండదు. గర్భం దాల్చడం పిల్లల్ని పెంచడం వంటి విషయాలు పూర్తిగా భర్తభర్తలకు మాత్రమే చెందిన అంశం. తమ కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా ప్రసూతి సెలవులు ఇవ్వడం మాత్రమే వారి పని.  అప్పుడు మహిళలు తమ ప్రసవం, బిడ్డ పెంపకం చూసుకుంటారు. అయితే మహిళా ఉద్యోగుల గర్భధారణ సమయాన్ని కూడా గణించే కంపెనీ గురించి మీరు విన్నారా? అవును, ఇదే విషయంతో ఒక చైనా కంపెనీ వెలుగులోకి వచ్చింది.

Maternity Leave: ఒకేసారి ప్రెగ్నెంట్స్  అయిన 3 మహిళా ఉద్యోగులు.. కుదరదంటూ బాస్ కోపం.. నెట్టింట్లో వైరల్
Maternity Leave
Surya Kala
|

Updated on: May 31, 2023 | 10:24 AM

Share

ఏ కంపెనీ అయినా సరే తమ ఉద్యోగులు శ్రద్ధతో పనిచేయాలని.. కంపెనీ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటుంది. అందుకు ఉద్యోగులు కష్టపడే విధంగా సదుపాయాలని కల్పిస్తుంది. ఒకొక్కసారి తమ ఉద్యోగి అనారోగ్యానికి గురైతే.. వాటికీ తగిన వైద్య సహాయం అందిస్తుంది. శరీరానికి తగిన విశ్రాంతి అవసరం అనుకుంటే అందుకు తగిన సెలవులను ఇస్తుంది. ఈ విధంగా తమ ఉద్యోగిని కేరింగ్ చూసుకుంటే.. అందుకు ప్రతిఫలంగా తమ కంపెనీ అభివృద్ధి చెందేలా పనిచేస్తారని కంపెనీ యాజమాన్యం భావిస్తుంది. ఇక మహిళా ఉద్యోగిని విషయంలోకి వస్తే.. వీరి కుటుంబం, వ్యక్తిగత విషయాల్లోకి ఏ కంపెనీ యాజమాన్యం జోక్యం చేసుకోడు. తమ కంపెనీలోని రూల్స్ కు అనుగుణంగా గర్భిణీ స్త్రీలకు తగిన విశ్రాంతిని ఇస్తూ.. మెటర్నిటీ లీవ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అయితే తాజాగా చైనాకు చెందిన ఓ కంపెనీ యాజమాన్యం తమ మహిళా ఉద్యోగులు ఎప్పుడు గర్భం దాల్చాలో.. చెప్పి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..

కుటుంబ నియంత్రణ అనేది భార్యాభర్తల మధ్య పరస్పర విషయం. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ ఉండదు. గర్భం దాల్చడం పిల్లల్ని పెంచడం వంటి విషయాలు పూర్తిగా భర్తభర్తలకు మాత్రమే చెందిన అంశం. తమ కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా ప్రసూతి సెలవులు ఇవ్వడం మాత్రమే వారి పని.  అప్పుడు మహిళలు తమ ప్రసవం, బిడ్డ పెంపకం చూసుకుంటారు. అయితే మహిళా ఉద్యోగుల గర్భధారణ సమయాన్ని కూడా గణించే కంపెనీ గురించి మీరు విన్నారా? అవును, ఇదే విషయంతో ఒక చైనా కంపెనీ వెలుగులోకి వచ్చింది.

మీటింగ్ పెట్టిన  బాస్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఓ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా ఉద్యోగులు ఒకేసారి గర్భం దాల్చారు. ఈ విషయం ఆ కంపెనీ యజమానికి తెలిసింది. వెంటనే స్పందించిన బాస్ తమ సిబ్బందికి మీటింగ్‌ పెట్టి.. ఒకే సారి ముగ్గురు ఉద్యోగులు గర్భం దాల్చితే కంపెనీకి ఇబ్బంది.. ఎందుకంటే మీరు మీ ఉద్యోగ బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక మీ ముగ్గరు ఒకే సారి గర్భం దాల్చకుండా వేర్వేరు సమయాల్లో గర్భం దాల్చండి. అప్పుడు పనికి ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పాడు. అంతేకాదు.. ఒకవేళ గర్భం దాల్చాల్సి వస్తే టర్న్‌వైజ్‌గా గర్భం దాల్చి ఉండాల్సిందని ఆ మహిళా ఉద్యోగులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరలైన పోస్ట్ 

ఈ గర్భిణీల్లో ఒకరు తమ గర్భధారణ ప్రణాళిక గురించి చర్చించడానికి తన యజమాని మీటింగ్ పెట్టినట్లు.. తాము ఏమిచెయ్యాలంటూ సలహా కోరుతూ Weiboలో పోస్ట్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారి చర్చకు దారి తీసింది. నివేదికల ప్రకారం, ఆ ముగ్గురు మహిళా ఉద్యోగుల్లో ఇద్దరు 37 ఏళ్లకు దగ్గరగా ఉన్నారు. ఒకరు 37 ఏళ్ల వయసున్న ఓ నవ వధువు వీలైనంత త్వరగా బిడ్డను కనాలని కోరుకుంటుంది. మరో 37 ఏళ్ల ఉద్యోగి రెండవ బిడ్డను కనాలని ఆలోచిస్తోంది. మరో ఉద్యోగి వయస్సు 28 ఏళ్లు. ఆమె సంవత్సరం ప్రారంభంలో కంపెనీలో చేరడానికి ముందే వివాహం చేసుకుంది. ఆమెకు ఉద్యోగం రాకపోయినా, గర్భం దాల్చాలనే ఆలోచనలో ఉంది. ముగ్గురు మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో యజమాని . సూచనా.ఓ గర్భవతి చేసిన పోస్ట్ వైరల్ గా మారి చర్చకు దారి తీసింది.

స్త్రీల పట్ల న్యాయంగా ప్రవర్తించలేదని కొందరు భావిస్తుంటే.. ఉద్యోగం చేయడం స్త్రీలకు ఎంత కష్టమో చూడండని మరొకరు కామెంట్ చేశారు. అయితే చాలామంది ఒకే సారి ముగ్గురు ఉద్యోగులు సెలవు పెడితే.. ఇతర సిబ్బంది పని అంటూ మరికొందరు ఆందోళనా వ్యక్తం చేస్తున్నారు. మరొకరు తానే కనుక ఈ ముగ్గురు మహిళలున్న కంపెనీలో పనిచేస్తే.. వర్క్ ఓవర్‌లోడ్ తో  నేను పిచ్చివాడిని అవుతానంటూ కామెంట్ చేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!