Plastic waste Problem: ప్లాస్టిక్ వ్యర్ధాల వలన పొంచి ఉన్న ముప్పు.. ప్రమాదంలో 22 కోట్ల మంది ప్రజల జీవితాలు

ప్రపంచంలోని ప్రజల ప్రాణాలు ముప్పులో ఉన్నాయి. ప్లాస్టివ్ వ్యర్ధాలు పర్యావరణానికి హానికరం మాత్రమే కాదు.. వరదలకు కారణంగా మారనున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొంది. ఈ సంఖ్య బ్రిటన్, ఫ్రాన్స్ , జర్మనీల మొత్తం జనాభాకు సమానం.

Plastic waste Problem: ప్లాస్టిక్ వ్యర్ధాల వలన పొంచి ఉన్న ముప్పు.. ప్రమాదంలో 22 కోట్ల మంది ప్రజల జీవితాలు
Plastic Waste
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2023 | 11:50 AM

ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు అన్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్ధాల వలన కలిగే నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులోనూ ప్లాస్టిక్ వ్యర్ధాలు భయంకరమైన వరదలకు ఎలా కారణం అవుతున్నాయో చెబుతూ ఒక నివేదిక వెలువడింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొంది. ఈ సంఖ్య బ్రిటన్, ఫ్రాన్స్ , జర్మనీల మొత్తం జనాభాకు సమానం. ప్లాస్టిక్ వల్ల వచ్చే వరద పేద , బలహీన వర్గాలకు ఎక్కువ నష్టం కలిగిస్తుందని పేర్కొంది.

ఇప్పటికే మన దేశంలో 2005లో ముంబైలో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదలకు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా కారణమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలు వలన కురిసిన నీరు సముద్రంలో చేరుకోవడనికి కాలువల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డుపడ్డాయి. దీంతో భారీ వర్షాలకు నగరం నుంచి నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఒక కొత్త నివేదిక వచ్చింది. అందులో ప్రపంచంలోని అత్యంత పేద ప్రజల్లో 21.8 కోట్ల మంది ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల తీవ్రమైన వరదల బారిన పడే అవకాశం ఉందని.. కోట్లాది మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది.

వరద ముప్పులో 4.1 కోట్ల మంది 

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ సహాయ సంస్థ టియర్‌ఫండ్, పర్యావరణ కన్సల్టెన్సీ రిసోర్స్ ఫ్యూచర్ ఈ నివేదికను విడుదల చేసింది. వరద ముప్పులో ఉన్న 22 కోట్ల మందిలో 4.1 కోట్ల మంది పిల్లలు, వృద్ధులు, వికలాంగులున్నారని  నివేదికలో పేర్కొంది. చాలామంది ప్రజలు ఏర్పడనున్న వరదలను ఎదుర్కొనే పరిస్థితులు లేవని.. ఈ  వ్యక్తులకు ఇప్పటికే ఆరోగ్యం, ఇతర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్లాస్టిక్ వల్ల ఏర్పడే వరదలు.. 

ఈ నివేదికలో ప్లాస్టిక్ వ్యర్ధాల వలన వరదలు మరింత ప్రమాదకరమైన రూపాన్ని తీసుకుంటాయని పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే దాని వల్ల డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. ఒక అంచనా ప్రకారం 2000 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు రెట్టింపు అయ్యాయి. ఘన వ్యర్థాలను సక్రమంగా పారవేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నాయంటే? 

దక్షిణ, తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా వరదల ప్రభావం ఎక్కువగా ఉందని ఈ నివేదికలో చెప్పబడింది. అంతేకాదు సబ్-సహారా ఆఫ్రికాలో ఈ రకమైన వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రదేశాలలో జనసాంద్రత ఎక్కువగా ఉంది. మురికివాడలలో నివసిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల గురించి చెప్పాలంటే 2050 నాటికి మురికివాడల జనాభా 300 కోట్లకు పెరుగుతుందని నివేదికలు వెల్లడించాయి.

మరిన్ని