Bees Kidnap: ఆ దేశంలో తేనెటీగలు కిడ్నాప్.. డ్రోన్ కెమెరా ఉపయోగించి మరీ దొంగతనం.. తలలు పట్టుకుంటున్న పోలీసులు

తేనెటీగలు చాలా విషపూరితమైనవన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రజలు తేనెటీగల దగ్గరకు వెళ్లడానికి భయపడతారు. అటువంటి పరిస్థితిలో తేనేటీగలను కిడ్నాప్ చేసేవారున్నారని మీకు తెలుసా.. అవును UKలో అలాంటిదే జరుగుతోంది.. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే అక్కడ తేనె తీగలను భారీగా అపహరిస్తున్నారు కూడా.. 

Bees Kidnap: ఆ దేశంలో తేనెటీగలు కిడ్నాప్.. డ్రోన్ కెమెరా ఉపయోగించి మరీ దొంగతనం.. తలలు పట్టుకుంటున్న పోలీసులు
Honey Bee Kidnap
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2023 | 11:12 AM

మానవునికి మేలుచేయు కీటకాల్లో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. తేనెను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు..  మైనం, పుప్పొడి, రాజాహరం, విషం వంటి వాటిని కూడా ఉత్పత్తి చేస్తాయి. తేనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. తేనెటీగలు సంఘజీవులు. ప్రతి తేనెపట్టులో ఒక రాణి ఈగ, కొన్ని వందల పోతుటీగలు, కొన్నివేల కూలి ఈగలు కలిసి సుమారు 50 వేల నుండి 60 వేల ఉంటాయి. గుడ్లు పెట్టే ఏకైక తేనెటీగ రాణి తేనెటీగ. తేనెటీగలు చాలా విషపూరితమైనవన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రజలు తేనెటీగల దగ్గరకు వెళ్లడానికి భయపడతారు. అటువంటి పరిస్థితిలో తేనేటీగలను కిడ్నాప్ చేసేవారున్నారని మీకు తెలుసా.. అవును UKలో అలాంటిదే జరుగుతోంది.. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే అక్కడ తేనె తీగలను భారీగా అపహరిస్తున్నారు కూడా..

మనుషులతో పాటు జంతువులను కూడా కిడ్నాప్ చేయడం గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నారు.. లేదా కిడ్నప్ కు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నారు. అయితే తేనెటీగల కిడ్నాప్ గురించి వినడం బహు అరుదు.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం గత 12 సంవత్సరాలలో యూకేలో సుమారు 10 లక్షల తేనెటీగలు అపహరణకు గురయ్యాయి. 130కి పైగా రాణి తేనెటీగలను దొంగలు దొంగిలించినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి రైతులు తేనె తీగలను పెంచుతున్న స్థలంలో ఈ చోరీలు జరిగాయి. ఇలా తేనె టీగల దొంగతనం వలన వ్యాపారంగా చేస్తున్న వ్యాపారాస్తులు చాలా నష్టపోతున్నారు. చాలామంది తమ వ్యాపారాన్ని మూసివేయవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

రాణి తేనెటీగలను కిడ్నాప్

నివేదికల ప్రకారం, ఒక తేనెటీగల పెంపకందారుడు మాట్లాడుతూ, గత 20 ఏళ్లలో చాలా రాణి తేనెటీగల కిడ్నాప్‌లు జరిగాయని .. ఇలా రాణి తేనెటీగలు అదృశ్యమైన వెంటనే.. మిగిలిన తేనెటీగలు కూడా అక్కడ నుండి  వెళ్ళిపోతున్నాయని చెప్పారు. దొంగలు చాలా తెలివైన వారని అంటున్నారు. రాణి తేనెటీగల వల్ల తేనెటీగలలో తేనె తయారవుతుందని, అందుకే వాటిని కిడ్నాప్ చేస్తున్నారని చెబుతున్నారు.

గూఢచారి డ్రోన్‌ను ఉపయోగించి దొంగలిస్తున్న దొంగలు 

రాణి తేనెటీగలు దొంగలిస్తున్న దొంగలను పట్టుకునేందుకు ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి.  ఇప్పటి వరకు తేనెటీగల కిడ్నాపర్ల జాడ తెలియలేదు. అయితే రాణి తేనెటీగలను కిడ్నాప్ చేయడానికి దొంగలు గూఢచారి డ్రోన్‌లను ఉపయోగిస్తారని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..