ఫుల్‌టైమ్‌ కూతురిగా ఉండేందుకు జాబ్‌ ఆఫర్ ప్రకటించిన వృద్ధ తల్లిదండ్రులు.. నెలకు జీతం ఎంతంటే..

ఈ ఫుల్ టైమ్ కూతురి ఆలోచన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒత్తిడితో కూడిన పని వాతావరణంలో సంతోషంగా ఉండేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో, ఇది ఇతరులకు ఎప్పుడూ వారి తల్లిదండ్రుల చెంతనే ఉండాలనే ఆలోచనను ప్రేరేపిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఫుల్‌టైమ్‌ కూతురిగా ఉండేందుకు జాబ్‌ ఆఫర్ ప్రకటించిన వృద్ధ తల్లిదండ్రులు.. నెలకు జీతం ఎంతంటే..
Full Time Daughter
Follow us

|

Updated on: May 30, 2023 | 3:34 PM

పిల్లలు పెద్దయ్యాక తమను పట్టించుకోవడం లేదని, వారితో సమయం గడిపే అవకాశమే లేకుండా పోతుందని తల్లిదండ్రులు చెప్పడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ఎందుకంటే నేటి తరానికి చెందిన తల్లిదండ్రులు ఎక్కువగా ఒంటరిగా భావించే స్థాయికి చేరుకుంటున్నారు. అదే సమయంలో వారి పిల్లలు తమ కోసం సంపాదన ప్రయత్నాల్లో బిజీగా ఉంటున్నారు. చైనాలోని ఓ తల్లిదండ్రులు దీనికి గొప్ప పరిష్కారం కనుగొన్నారు. ఒక చైనీస్ తల్లిదండ్రులు తమ కుమార్తెను పూర్తి సమయం తమతోనే గడిపేందుకు ప్రత్యేకించి జీతం ఇచ్చి నియమించుకున్నారు. కుమార్తె పూర్తి సమయం వారితోనే గడపడానికి ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు నెలకు 4,000 యువాన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం నెలకు రూ. 47,000 ఇస్తారు. తల్లిదండ్రులు ఇలాంటి ఆఫర్ చేయడంతో 40 ఏళ్ల కుమార్తె తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసింది.

చైనీస్ వార్తా సంస్థలో 15 సంవత్సరాలు పనిచేసిన 40 ఏళ్ల ఆ మహిళ, పదోన్నతి పొందినప్పుడు కార్యాలయంలో మరింత ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు, తనకు మధ్య సంబంధం దూరం పెరిగింది. నియానాన్ తల్లిదండ్రులు తమ కుమార్తెను పూర్తి సమయం కుమార్తెగా నియమించుకోవడానికి ముందుకు వచ్చారు. ఫుల్‌టైమ్‌ కూతురిగా మారితే నెలకు రూ. 47వేల రూపాయలు ఇస్తామన్న ఆ తల్లిదండ్రుల ప్రతిపాదనను వారి కూతురు అంగీకరించింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదికలో వెల్లడించింది. ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు తమ కుమార్తెకు ప్రేమపూర్వక విధానం, ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇప్పుడు తనది ప్రేమతో నిండిన వృత్తి అని ఆ 40 ఏళ్ల మహిల చెప్పింది.

ఆమె ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక గంట పాటు డ్యాన్స్ చేయడం ద్వారా తన రోజును ప్రారంభిస్తుంది. వారితో పాటు బయటకువెళ్లి షాపింగ్‌ చేస్తుంది. సాయంత్రం పూట తన తండ్రితో కలిసి సరదాగా వంటలు చేసేది. మిగిలిన ఇంటి పనులు కూడా తానే చేస్తానని నియానన్ చెప్పింది. 40 ఏళ్ల కూతురు ప్రతి నెలా తన తల్లిదండ్రులతో కలిసి చిన్న విహారయాత్ర కూడా చేస్తుంది. ఆమె స్వంత తల్లిదండ్రులే ఆమెను పూర్తి సమయం కుమార్తెగా నియమించిన తర్వాత, ఆమె మానసికంగా ప్రశాంతంగా ఉండసాగింది. ఉద్యోగంలో ఉండే ఒత్తిడి తొలగిపోయింది. ఎక్కువ డబ్బు సంపాదించాలనే వైఖరి మార్చుకున్నారు. బదులుగా జీవితంలో ఆనందానికే ప్రాధాన్యత ఇవ్వాలని నియానన్‌ గ్రహించినట్లు చెప్పారు. అంతేకాదు.. కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులు తమ కుమార్తెకు మరో మంచి ఉద్యోగం దొరికితే దానిని ఎంచుకోవచ్చునని కూడా హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ఫుల్ టైమ్ కూతురి ఆలోచన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒత్తిడితో కూడిన పని వాతావరణంలో సంతోషంగా ఉండేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో, ఇది ఇతరులకు ఎప్పుడూ వారి తల్లిదండ్రుల చెంతనే ఉండాలనే ఆలోచనను ప్రేరేపిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...