Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగేళ్ల క్రితం చనిపోయిన సన్యాసిని.. చెక్కు చెదరని స్థితిలో మృతదేహం లభ్యం.. క్యూ కట్టిన భక్తులు..

95 ఏళ్ల వయసులో మరణించిన సన్యాసిని సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ మృతదేహం లభ్యమైనట్లు విదేశీ మీడియా పేర్కొంది. స్మశానవాటిక నుండి వెలికితీసిన మృతదేహాన్ని చూడటానికి వందలాది మంది ప్రజలు మఠానికి తరలి వస్తున్నారు. మే 2019లో మరణించిన సన్యాసిని మృతదేహాన్ని చెక్క శవపేటికలో పెట్టి పాతిపెట్టినట్లు..

నాలుగేళ్ల క్రితం చనిపోయిన సన్యాసిని.. చెక్కు చెదరని స్థితిలో మృతదేహం లభ్యం.. క్యూ కట్టిన భక్తులు..
Nuns Body
Follow us
Jyothi Gadda

|

Updated on: May 29, 2023 | 9:36 PM

నాలుగేళ్ల క్రితం మరణించిన క్యాథలిక్ సన్యాసిని మృతదేహం శవపేటికలో లభ్యమైంది. అమెరికాలోని మిస్సోరీ పట్టణంలో మఠంలోని శ్మశానవాటికలో 95 ఏళ్ల వయసులో మరణించిన సన్యాసిని సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ మృతదేహం లభ్యమైనట్లు విదేశీ మీడియా పేర్కొంది. స్మశానవాటిక నుండి వెలికితీసిన మృతదేహాన్ని చూడటానికి వందలాది మంది ప్రజలు మిస్సోరి పట్టణంలోని మఠానికి తరలి వస్తున్నారని గార్డియన్ నివేదించింది. మే 2019లో మరణించిన సన్యాసిని మృతదేహాన్ని చెక్క శవపేటికలో పెట్టి పాతిపెట్టినట్లు కాథలిక్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మే 18, 2023న సన్యాసిని మృతదేహం లభ్యమైంది. అయితే, ఆమె మృతదేహం చెక్కు చెదరకుండా అలాగే ఉందని, కుళ్లిపోయిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని అధికారులు తెలిపారు.

పూడ్చిపెట్టిన శరీరం నాలుగేళ్ల తర్వాత కూడా అదే స్థితిలో ఉంది. సన్యాసి ముఖంపై కొంత మురికి ఉందని విదేశీ మీడియా పేర్కొంది. కుడి కంటికి కాస్త తేడా రావడంతో అక్కడ మైనపు మాస్క్ పెట్టారు. కనురెప్పలు, వెంట్రుకలు, కనుబొమ్మలు, ముక్కు, పెదవులు ఒకే స్థితిలో ఉన్నాయని అక్కడ చూసిన ఒక వ్యక్తి పేర్కొన్నట్లు న్యూస్‌వీక్ నివేదించింది.

ఎంబామింగ్ చేయకుండా దహనం చేయడంతో పేటికలో ఎముకలు మాత్రమే ఉంటాయని భావించి శవపేటికను తొలగించినట్లు శ్మశానవాటిక సిబ్బంది తెలిపారు. ఎంబాల్ చేయని మృతదేహాన్ని సాధారణ చెక్క పెట్టెలో పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని మిస్సోరి పట్టణంలోని ఆశ్రమంలో ఉంచినట్టుగా సమాచారం. చాలా మంది ఆమె శరీరాన్ని ‘మిస్సోరి అద్భుతం’ అని పిలుస్తున్నారు. రద్దీ పెరగడంతో కాన్సాస్ సిటీ డియోసెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. సమగ్ర విచారణ కోసం ఆమె మృతదేహాన్ని భద్రపరచడం ముఖ్యమన్నారు. విచారణ సమయంలో దేవుని చిత్తం కోసం ప్రార్థించాలని బిషప్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..