- Telugu News Photo Gallery Business photos Cooling Gel Mattress Is The Best Option In Summer Telugu News
హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా.. ఈ బెడ్ షీట్‌పై పడుకుంటే చాలు.. వణికిపోవాల్సిందే..!
Cooling Gel Mattress: రోహిణి కార్తె రావడంతోనే ఎండలు దంచికొడుతున్నాయి. సుమారు 43డిగ్రీల ఉష్ణోగ్రత వేడితో జీవకోటి విలవిల్లాడుతోంది. మరో వారం రోజుల పాటు ఎండ, వేడిగాలుల తీవ్రత పెరుగుతుంది. ఇటువంటి వేడిలో చల్లగా ఉండేందకు చాలామంది ప్రజలు ఏసీలు, కూలర్లను పరిగెత్తిస్తున్నారు. దీంతో కరెంటు బిల్లు కూడా తడిసిమోపడవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఓ అద్భుతమైన బెడ్‌షీట్ అందుబాటులోకి వచ్చింది. ఇది అన్ని AC-కూలర్‌లను పక్కకు నెట్టేస్తూ.. వేడిని తరిమికొడుతుంది.
Updated on: May 29, 2023 | 8:43 PM

వేసవికాలంలో చల్లదనం ఇచ్చే వస్తువులు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఈ క్రమంలో తాజాగా ఏసీ లాంటి కూలింగ్ బెడ్ షీట్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ బెడ్‌షీట్ మీ ఇంట్లో చాలు. ఎంత అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

కూలింగ్ బెడ్ షీట్ తో వేసవి తాపానికి ఎంచక్కా చెక్ పెట్టొచ్చు. ఈ బెడ్ షీట్ పై పడుకుంటే చల్లదనం ఆస్వాదిస్తూ సుఖంగా నిద్రపోవచ్చు. ఇది చూడడానికి సాధారణ బెడ్ షీట్ మాదిరే కనిపిస్తుంది. దీని ప్రత్యేకతలు మాత్రం అద్భుతమనే చెప్పాలి.

ఈ బెడ్ షీట్ లో కూలింగ్ జెల్ మ్యాట్రెస్ ఉంటుంది. అంటే చల్లదనం కోసం జల్ సాంకేతికతను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ బెడ్ షీట్ లో గాలి నింపబడి ఉంటుంది. ఏర్పాటుచేసిన ఫ్యాన్ 4.5 వాట్ల శక్తిని ఉపయోగిస్తుంది. అంటే ఒక యూనిట్ విద్యుత్ తో ఒక వారం పాటు ఈ బెడ్ షీట్ రన్నింగ్ లో ఉంటుంది.

ఈ బెడ్ షీట్ బరువు కేవలం రెండు కేజీలు మాత్రమే ఉంటుంది. దీన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులువుగా తీసుకు వెళ్ళవచ్చు. ఈ బెడ్ షీట్ కూలింగ్ టైమర్ తో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో బడ్జెట్ ధరలోనే ఈ బెడ్ షీట్లు లభించనున్నాయి.

ఈ మ్యాట్రెస్‌లో జెల్ టెక్నాలజీని అందించారు. దీనిని ఆన్ చేయడానికి ప్లగ్‌కి కనెక్ట్ చేయాలి. అనంతరం ఆటోమాటిక్‌గా బెడ్‌పై ఉన్న షీట్‌ను జెల్ సహాయంతో కూల్‌గా మార్చేస్తుంది. దీంతో ఇది నిమిషాల్లోనే బెడ్ షీట్‌ను చల్లబరుస్తుంది. ఈ షీట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా నిశ్శబ్దంగా పనిచేస్తుంది.





























