గుడిలో నగ్నంగా సంచరించిన జర్మన్ మహిళ..! సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో.. కలకలం

ఆమె హఠాత్తుగా నగ్నంగా ఎందుకు గుడిలో కలకలం సృష్టించిందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయంలో నగ్నంగా ఉండి పవిత్ర స్థలంలో కలకలం సృష్టించినందుకు జర్మన్ టూరిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గుడిలో నగ్నంగా సంచరించిన జర్మన్ మహిళ..! సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో.. కలకలం
Hindu Temple In Bali
Follow us

|

Updated on: May 29, 2023 | 7:24 PM

ఇండోనేషియాల బాలిలోని ఓ గుడిలో జర్మనీకి చెందిన ఓ మహిళ హఠాత్తుగా బట్టలు విప్పేసి వింతగా ప్రవర్తించింది. ఇదంతా చూసిన జనం షాక్‌తో నివ్వేరపోయారు. బాలిలోని ఆలయంలో జర్మన్ మహిళ వింతగా ప్రవర్తించి సంచలనం సృష్టించింది. దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడిలో బట్టలు విప్పేసిన మహిళ అటూ ఇటూ తిరుగుతూ ఆలయ సిబ్బందితో గొడవ పడింది. బాలి ఆలయ నిర్వాహకులు అత్యవసర సేవలకు, పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఎలాగోలా అమ్మాయిని కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

నివేదిక ప్రకారం, 28 ఏళ్ల జర్మన్ మహిళ పేరు టార్జా. ఆమె బస చేసిన హోటల్‌కు డబ్బు కూడా చెల్లించలేదని తెలిసింది. ఇండోనేషియా కఠినమైన నిబంధనలను అమలు చేస్తూ పర్యాటకుల పట్ల అనుచితంగా, కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె హఠాత్తుగా నగ్నంగా ఎందుకు గుడిలో కలకలం సృష్టించిందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయంలో నగ్నంగా ఉండి పవిత్ర స్థలంలో కలకలం సృష్టించినందుకు జర్మన్ టూరిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను మానసిక ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మహిళ మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత, ఇండోనేషియా అధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రోటోకాల్‌ను అనుసరించి, చికిత్స కోసం మానసిక ఆసుపత్రికి పంపారు. తాను ఉంటున్న హాస్టల్‌లో కూడా ఆమె తరచుగా నగ్నంగా తిరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికార ప్రతినిధి స్టీఫన్ మాట్లాడుతూ జర్మన్ మహిళ కోపంగానూ, విచారంగానూ ఉందన్నారు. పర్యాటనకు వెళ్లిన మహిళ.. ఇంటి నుంచి తెచ్చిన డబ్బు అంతా అయిపోయిందని చెప్పింది. కాగా, బాధితురాలి నగ్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన అనంతరం అర్చకులు ఆలయాన్ని శుభ్రం చేశారు. బాలిలో హిందువుల మత మనోభావాలను కించపరిచే కేసులు కొంతకాలంగా పెరుగుతున్నాయని ఇండోనేషియా విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది. మత్తులో ఉన్నప్పుడు ఇబ్బంది కలిగించడం లేదా మతపరమైన స్థలాల గౌరవాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించడం లేదా అశ్లీలతను వ్యాప్తి చేయడం వంటి అభియోగాల కింద విదేశీ పర్యాటకులు దేశం నుండి బహిష్కరించబడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్  క్లిక్ చేయండి..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..