ఇంట్లో మీ పూర్వీకుల ఫోటోలు పెట్టేందుకు ఏది సరైన దిశ .. ఇది మీ సంపద, శ్రేయస్సును పెంచుతుంది..
కొంతమంది తమ పూర్వీకుల ఫోటోలను ఇంట్లో ఉంచుకుంటారు. అలా చేయటం వల్ల తప్పులేదు. కానీ, కొన్ని నియమాలు పాటించాలి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, పొరపాటున కూడా ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో పూర్వీకుల ఫోటోలను వేలాడదీయకూడదు. మీ ఇంటిలో మీ పూర్వీకుల చిత్రాలను ఉంచేటప్పుడు పైన పేర్కొన్న వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి.
హిందూ శాస్త్రం ప్రకారం, అమావాసి రోజుల్లో పూర్వీకులకు దర్పణం సమర్పించాలి. ఇది పితృస్వభావాన్ని కలిగిస్తుంది. వారి అనుగ్రహంతో ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. సంపద, శ్రేయస్సు పొందుతారు. జ్యోతిష్యుల ప్రకారం, వారి జాతకంలో పితృ దోషం ఉన్నవారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకోసం విశేషమైన రోజున పూజలు చేయాలి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మనసులో పెద్దలను తలచుకుని దక్షిణం వైపు నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో పూర్వీకుల ఆశీస్సులు ఉంటాయి. కొంతమంది తమ పూర్వీకుల ఫోటోలను ఇంట్లో ఉంచుకుంటారు. అలా చేయటం వల్ల తప్పులేదు. కానీ, కొన్ని నియమాలు పాటించాలి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, పొరపాటున కూడా ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో పూర్వీకుల ఫోటోలను వేలాడదీయకూడదు. చెట్టు కింద పూర్వీకుల ఫోటోలను ఉంచవచ్చు.
వాస్తు శాస్త్రంలో పూర్వీకుల ఫోటోలను వేలాడదీయడం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ మంది పూర్వీకుల ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు. ఇంటి సభ్యులందరూ చూడగలిగే చోట పూర్వీకుల ఫోటోను ఉంచాలి. అయితే మెయిన్ డోర్ పై పూర్వీకుల ఫోటోను పెట్టరాద్దు. బయటి వ్యక్తుల చూపు పూర్వీకులపై పడినప్పుడు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఇంటి పూజ గదిలో పూర్వీకుల ఫోటోలను ఉంచవద్దు. పూర్వీకుల చిత్రాలను దేవతలతో సమానం చేయకూడదు. పూర్వీకుల ఫోటోలను పడకగదిలో, వంటగదిలో లేదా ఇంటి మధ్యలో ఉంచకూడదని వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది. ఈ ప్రదేశాలలో పూర్వీకుల ఫోటోలు ఉంచడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి.
మరీ ఎక్కడ పెట్టాలి?
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉత్తర దిశలో పూర్వీకుల ఫోటోలను ఉంచండి. పూర్వీకులు దక్షిణాన నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి మీరు ఉత్తరం వైపు ఉన్న గోడలపై పూర్వీకుల ఫోటోలను ఉంచవచ్చు. మీ ఇంటిలో మీ పూర్వీకుల చిత్రాలను ఉంచేటప్పుడు పైన పేర్కొన్న వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).