AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US News: కారు ప్రమాదంలో ఎన్నారై మృతి.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే దారుణ ఘటన..

ఓహియో స్టేట్ హైవే పెట్రోల్ నార్వాక్ పోస్ట్ ప్రకటన ప్రకారం, అతని వాహనం రోడ్డుకు కుడి వైపు నుంచి పక్కకు వెళ్లి ఒక గుంటను ఢీకొట్టింది. మిలన్ కారులో ఒంటరిగా ఉన్నాడని.. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో కారులోనే ఇరుక్కుపోయాడని పోలీసులు తెలిపారు.

US News: కారు ప్రమాదంలో ఎన్నారై మృతి.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే దారుణ ఘటన..
Road Accident In Us
Surya Kala
|

Updated on: Jun 03, 2023 | 8:34 AM

Share

అమెరికాలోని విషాద ఘటన చోటు చేసుకుంది. ఓహియో రాష్ట్రంలో కారు ప్రమాదంలో ఒక ఎన్నారై మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి 30 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మిలన్ హితేష్‌ భాయ్ పటేల్ (30) అని అధికారులు గుర్తించారు. మిలన్ హితేష్‌భాయ్ పటేల్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల తర్వాత స్టేట్ రూట్ 61లో ఉత్తరాన ప్రయాణిస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మిలన్ కారు రోడ్డుకు కుడివైపు నుండి ఒక గుంటను ఢీకొట్టిందని ఓహియో స్టేట్ హైవే పెట్రోల్ నార్వాక్ పోస్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఓహియో స్టేట్ హైవే పెట్రోల్ నార్వాక్ పోస్ట్ ప్రకటన ప్రకారం, అతని వాహనం రోడ్డుకు కుడి వైపు నుంచి పక్కకు వెళ్లి ఒక గుంటను ఢీకొట్టింది. మిలన్ కారులో ఒంటరిగా ఉన్నాడని.. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో కారులోనే ఇరుక్కుపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని వాహనం నుంచి బయటకు తీయడానికి ఎమర్జెన్సీ రెస్పాండర్‌లు మెకానికల్ పరికరాన్ని ఉపయోగించారు. చివరకు మిలన్ ను కారు నుంచి బయటకు తీశారు. చివరికి తీవ్ర  గాయాలతో మరణించాడని Fox8 న్యూస్ నివేదించింది.

మిలన్ హితేష్‌భాయ్ పటేల్ ప్రాణాలు కోల్పోవడం అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పటేల్ మద్యం మత్తులో ఉన్నాడా లేక డ్రగ్స్ మత్తులో ఉన్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?