Love Affire: ఉద్యోగం లేదు.. డబ్బుల కోసం 3 అమ్మాయిలకు వల.. 12 లక్షలు స్వాహా.. నెక్స్ట్ ఏం జరిగిందంటే
చైనాలో ఓ అబ్బాయి ముగ్గురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించాడు. అంతేకాదు వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ముగ్గురు దగ్గర నుంచి సుమారు 12 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడు. అయితే ఆ యువకుడు చేసిన ఒక్క పొరపాటుతో చేసిన మోసం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు.
ఒక యువకుడు డబ్బులకోసం అమ్మాయిలకు ప్రేమ వల వేసి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తూ ఉంటాడు ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా సినిమాల్లో లేదా సీరియల్స్ లో చూస్తూ ఉంటాము. అయితే సినిమా అనిపించే ఈ స్టోరీ రియల్ గా చోటు చేసుకుంది. తన ఖర్చులు, అప్పు తీర్చడం కోసం చైనా కు చెందిన ఓ నిరుద్యోగ యువకుడు ముగ్గురు అమ్మాయిలతో పరిచయం చేసుకుని స్నేహం చేశాడు. తర్వాత ప్రేమ పేరుతో వారితో మరింత దగ్గరయ్యాడు. ట్రాప్ చేసి ముగ్గురు అమ్మాయిల దగ్గర నుంచి పెళ్లి చేసుకుంటానంటూ 100,000 యువాన్ల (మన దేశ కరెన్స్ లో రూ. 11,67,982) మోసం చేశాడు. ఇప్పుడు ఆ యువకుడు చేసిన పనికి శిక్ష కూడా పడింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో వచ్చిన కథనం ప్రకారం.. ఫిబ్రవరి 10న ముగ్గురు యువతలు కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఓ యువకుడు తమని మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. షాంఘైలోని యాంగ్‌పు జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హే షివే తమను మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. హే షివే తమ వద్ద డబ్బు అప్పుగా తీసుకున్నాడని, కానీ తిరిగి ఇవ్వలేదని యువతలు పేర్కొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన ముగ్గురు యువతుల్లో ఒకరైన చెన్ హాంగ్ మాట్లాడుతూ.. షివే నడవడికపై తనకు అనుమానం వచ్చిందని.. ఒక రోజు తాగిన మత్తులో నిద్రలోకి జారుకున్నాడని.. అప్పుడు తాను అతని ఫోన్ చెక్ చేసినట్లు చెప్పింది. ఆ సమయంలో ఫోన్‌లో ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం అంటూ చెన్ జియావో ఫ్యాన్ అనే యువతి మెసేజ్ చేసింది. తాను ఆ నెంబర్ ను నోట్ చేసుకుని తర్వాత ఆ యువతితో మాట్లాడినట్లు పేర్కొంది. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన విషయం విని షాక్ తిన్నట్లు వెల్లడించింది.
సాధారణంగా రాత్రిపూట నిద్రపోవడానికి తన ఫ్లాట్‌కి వచ్చే షివే తో కలిసి నివసిస్తున్నట్లు జియావో ఫ్యాన్ తో చెప్పింది చెన్. మాటల మధ్యలో తామిద్దరినీ పెళ్లి చేసుకుంటానని షివే మాట ఇచ్చాడని తెలిసింది. అయితే కథ ఇక్కడితో ఆగలేదు..
ఫిబ్రవరి 10న, షివే గర్ల్‌ఫ్రెండ్ అని చెప్పుకునే జావో లిన్ అనే మూడవ అమ్మాయి నుండి చెన్‌కి కాల్ వచ్చింది. ఇదంతా తెలిసిన చెన్.. తన ప్రేమికుడు షివే నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఆటను నిరుద్యోగి.. డబ్బులు ఇవ్వలేకపోయాడు. దీంతో ముగ్గురు యువతులు కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చారు. షివే అక్టోబర్ 2022 నుండి చెన్‌తో, జూన్ 2022 నుండి జియావో.. 2021 నుండి జావోతో డేటింగ్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
2020లో ఉద్యోగం మానేశాడు విచారణలో షివే 2020లో ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడని.. అప్పటి నుండి నిరుద్యోగిగా ఉన్నాడని తేలింది. ముగ్గురు అమ్మాయిల నుంచి తీసుకున్న డబ్బుతో తన ఖర్చుల వెల్లదీశేవాడు. అప్పు తీర్చేవాడు. ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు మంచి స్నేహితులయ్యారు. కలిసి విదేశాలకు కూడా వెళ్లారు.
ముగ్గురు యువతులు చాలామంది మనసు కలవారని.. అందుకనే ఈజీగా యువకుడు మోసం చేసినట్లు పోలీసు అధికారి చెప్పారు. అంతేకాదు ఇప్పుడు షివేకి 2 సంవత్సరాల 6 నెలల శిక్ష పడింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..