AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi In US: ప్రధాని మోడీ దేవుడికే విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పగలరు.. దేశం మొత్తం నా వెంటే ఉందంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు

శాన్ ఫ్రాన్సిస్కోలో మొహబ్బతేన్ షాప్ కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ అన్నీ తనకే తెలుసని భావిస్తారని రాహుల్ అన్నారు. అంతేకాదు మోడీ శాస్త్రవేత్తలకు శాస్త్రాన్ని వివరించగలరు. అంత ఎందుకు విశ్వం ఎలా పనిచేస్తుందో దేవునికి కూడా వివరించగలరని ఎద్దేవా చేశారు. కొందరికి దేవుడి కంటే ఎక్కువ తెలుసని అనుకుంటారని చెప్పారు.

Rahul Gandhi In US: ప్రధాని మోడీ దేవుడికే విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పగలరు..  దేశం మొత్తం నా వెంటే ఉందంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi
Surya Kala
|

Updated on: May 31, 2023 | 10:47 AM

Share

రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ జోడో యాత్రను ప్రస్తావించారు. ప్రధాని మోడీ దేశంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు..  సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్.

శాన్ ఫ్రాన్సిస్కోలో మొహబ్బతేన్ షాప్ కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ అన్నీ తనకే తెలుసని భావిస్తారని రాహుల్ అన్నారు. అంతేకాదు మోడీ శాస్త్రవేత్తలకు శాస్త్రాన్ని వివరించగలరు. అంత ఎందుకు విశ్వం ఎలా పనిచేస్తుందో దేవునికి కూడా వివరించగలరని ఎద్దేవా చేశారు. కొందరికి దేవుడి కంటే ఎక్కువ తెలుసని అనుకుంటారని చెప్పారు. భారతదేశంలో వివిధ భాషలు, వివిధ మతాల ప్రజలు కలిసి జీవిస్తారు. ప్రతిదీ తనకే తెలుసు అని ఒక వ్యక్తి అనుకోవడం తప్పు.. ఇది ఒక వ్యాధి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో కొన్ని గ్రూపులు తమకే అన్నీ తెలుసని.. బహుశా దేవుడి కంటే కూడా ఎక్కువే తెలుసు అనుకుంటారని చెప్పారు రాహుల్ గాంధీ.

ప్రస్తుతం దేశం విద్వేషాల మార్కెట్‌లో ఉందని.. తాను భారత్ జోడో యాత్ర చేసి ప్రేమ దుకాణాన్ని తెరచినట్లు చెప్పారు. తాను చేసిన  ప్రయాణంలో ప్రజలు నన్ను అలసిపోవద్దని చెప్పేవారని.. దేశం మొత్తం నాతో ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

దృష్టి మరల్చేందుకు కొత్త పార్లమెంటు భవనం అంశం

బీజేపీ-ఆరెస్సెస్ లు కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని రాహుల్ అన్నారు. అదే సమయంలో కొత్త పార్లమెంట్ హౌస్ అంశం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే అంటూ చెప్పారు. దేశంలో ముస్లింలు తమపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. రాహుల్ గాంధీ తన 10 రోజుల పర్యటన కోసం మంగళవారం రాత్రి అమెరికా చేరుకున్నారు. మరో 10 రోజుల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..