AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Germany: జర్మనీ అధీనంలోనే భారతీయ బాలిక.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

అరిహా షాను ఆమె తల్లిదండ్రులు వేధించారన్న ఆరోపణలపై జర్మనీ బాలల సంరక్షణ అధికారులు 2021 సెప్టెంబర్ 23న పాపను తమ అధీనంలోకి తీసుకున్నారు. నాటి నుంచి చిన్నారి ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటోంది. బాలికను ఎలా వెనక్కుతెచ్చుకోవాలో తెలీక ఆమె తల్లిదండ్రులు భవేష్ షా, ధారా షా ఆవేదనలో మునిగిపోయారు

Germany: జర్మనీ అధీనంలోనే భారతీయ బాలిక.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
Indian Girl
Surya Kala
|

Updated on: Jun 04, 2023 | 7:18 AM

Share

గత ఇరవై నెలలుగా జర్మనీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భారత సంతతి బాలిక అరిహా షా ను వీలైనంత త్వరగా స్వదేశానికి పంపాలని కేంద్రం శుక్రవారం జర్మనీని కోరింది. ఈ విషయంలో జర్మనీపై వివిధ దౌత్య మార్గాల్లో ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

అరిహా షాను ఆమె తల్లిదండ్రులు వేధించారన్న ఆరోపణలపై జర్మనీ బాలల సంరక్షణ అధికారులు 2021 సెప్టెంబర్ 23న పాపను తమ అధీనంలోకి తీసుకున్నారు. నాటి నుంచి చిన్నారి ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటోంది. బాలికను ఎలా వెనక్కుతెచ్చుకోవాలో తెలీక ఆమె తల్లిదండ్రులు భవేష్ షా, ధారా షా ఆవేదనలో మునిగిపోయారు. కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ఈ విషయమై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం పాటు బాలికను మరోదేశంలో ఉంచడమంటే ఆమెకున్న సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన హక్కులను ఉల్లఘించడమేనని బాలిక తల్లిదండ్రులు, భారత ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు.

ముంబైకి చెందిన భవేష్ షా, ధారా షా దంపతులు 2018లో జర్మనీకి వెళ్లారు. అక్కడ వారికి అరిహా షా జన్మించింది. ఓ రోజు పాప ఆడుకుంటుండగా కింద పడిపోవడంతో ఆమె మర్మావయవం వద్ద గాయమైంది. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయం తీరునుబట్టి చిన్నారిపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానించిన జర్మనీ బాలల సంరక్షణ అధికారులు పాపను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, మరో రెండు నెలల్లో భవేశ్ షా దంపతుల వీసా గడువు ముగియనుంది. దీంతో, పాప లేకుండా భారత్‌కు తిరిగిరావాల్సి వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి