Nizamabad: అమెరికాలో ఇందూరు యువకుడి మృతి.. ఉన్నత చదువుల కోసం వెళ్లి..
Nizamabad News: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్ (25) బయోమెడికల్ ఇంజినీరింగ్ చదివేందుకు సెప్టెంబరులో అమెరికాకు వెళ్లాడు.
Nizamabad News: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్ (25) బయోమెడికల్ ఇంజినీరింగ్ చదివేందుకు సెప్టెంబరులో అమెరికాకు వెళ్లాడు. శైలేష్ యూనివర్సిటీ అప్ బ్రిడ్జిపోర్ట్ లో బయోమెడికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేస్తున్నాడు. శనివారం న్యూజెర్సీలోని సెల్టన్ కూడలి వద్ద శైలేష్ కారు వెళ్తోంది. ఈ క్రమంలో అతను వెళ్తున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
నేరుగా గ్యాస్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి శైలేష్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇక.. రోడ్డుప్రమాదంలో మృతి చెందిన శైలేష్‌కు ఘటనాస్థలంలో నివాళులర్పించారు అతని స్నేహితులు. శైలేష్ మృతదేహాన్ని సోమవారం అప్పగించే అవకాశం ఉందని చెప్పారు తానా సభ్యులు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు తానా సభ్యులు చర్యలు చేపట్టారు.
గుర్రపు శైలేష్ మరణంతో బడాభీమ్‌గల్ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కొడుకు మృతి వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. మృతుడి తండ్రి సత్యం గల్ఫ్ దేశం వెళ్లి తిరిగి వచ్చారని.. ఈ క్రమంలో చేతికొచ్చిన కొడుకు మరణించాడని గ్రామస్థులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..