AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

వీధిలో ఆడుకుంటున్న చిన్నారులపై ఇంటి గోడకూలిన ఘటన.. హైదరాబాద్‌ మూసాపేట్‌లో జరిగింది. స్థానిక ప్రగతినగర్‌లో ఒక ఇంటి బాల్కనీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు గౌతమ్‌, లక్ష్మిలపై శిథిలాలు పడిపోయాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు... ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయ్‌.

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
Wall Collapse
Basha Shek
|

Updated on: Jun 04, 2023 | 7:58 AM

Share

వీధిలో ఆడుకుంటున్న చిన్నారులపై ఇంటి గోడకూలిన ఘటన.. హైదరాబాద్‌ మూసాపేట్‌లో జరిగింది. స్థానిక ప్రగతినగర్‌లో ఒక ఇంటి బాల్కనీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు గౌతమ్‌, లక్ష్మిలపై శిథిలాలు పడిపోయాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు… ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయ్‌. చెంగుచెంగున పరుగులెత్తుతూ వస్తున్న పసివాళ్లపై… ఒక్కసారిగా గోడపడిపోయిన దృశ్యాలు షాకింగ్‌కి గురిచేస్తున్నాయ్‌. మొదటి అంతస్తులోని ఈ గోడ కూలడంతో.. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అటు నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిపైనా శిథిలాలు పడ్డాయి. అక్కడే ఉన్న తల్లి.. పిల్లల్ని శిథిలాల కింది నుంచి లాగేందుకు ప్రయత్నం చేసింది. కానీ, రాడ్స్‌తో కూడిన శిథిలాలు బరువుగా ఉండటంతో .. పిల్లల్ని బయటకు లాగడం కష్టతరమైంది. ఆ దృశ్యాల్ని సైతం సీసీ ఫుటేజీలో చూడొచ్చు. ఎలాగోలా బయటకు తీసి ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఇద్దరు చిన్నారులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారిని రక్షించేందుకు వైద్యులు శ్రమిస్తున్నప్పటికీ.. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. గోడమొత్తం ఒక్కసారిగా మీదపడటంతో.. ప్రమాద తీవ్రత పెరిగినట్టు తెలుస్తోంది. ప్రగతి నగర్‌లో ప్రమాదానికి కారణమైన ఇంటిని .. 2007లో నిర్మించారు. అయితే, ముందు భాగంలో బాల్కనీలా కట్టిన రెయిలింగ్‌కు కొన్నాళ్లుగా పగుళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇంతటి ప్రమాదం జరిగింది. చిన్నారుల పాలిట శాపంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!