Viral Video: బీరు తాగుతూ యోగా చేయాలట..మూడు సిప్పులు.. ఆరు ఆసనాలు.. ఎక్కడో తెలుసా..?
ఎవరైనా తమ చేతిలో బీరు డబ్బా పట్టుకుని యోగా చేస్తూ కనిపిస్తే మీకు ఎలా ఉంటుంది. వాళ్లని చూడగానే మీ మనసులో ఏమనుకుంటారు. బహుశా మీరు అలాంటి వాళ్లని చూడగానే ముఖం చిట్లించవచ్చు. లేదంటే మీరు చాలా ఇబ్బందిగా ఫీలవ్వొచ్చు. అయితే విదేశాల్లో ఇదే జరుగుతోంది. ఒక చేత్తో బీరు సీసా పట్టుకుని యోగా చేసే పద్ధతి ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. ప్రజలు దీన్ని ఆనందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వింత యోగా గురించి వివరంగా తెలుసుకుందాం..
మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. కానీ, నేటి కాలంలో చిన్న వయస్సులోనే తీవ్రమైన వ్యాధులు ప్రజలను ప్రభావితం చేయడం ప్రారంభించాయి. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి దీనికి అతి పెద్ద కారణంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీన్ని మెరుగుపరచడానికి యోగా, వ్యాయామాన్ని ప్రజలు తమ రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవటం చాలా ముఖ్యం. యోగాతో అన్ని రోగాలను దూరం చేసుకోవచ్చు. దీని ప్రాముఖ్యత ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. యోగా చేయాలంటే మనిషి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రతతో ఉండాలని అందరికీ తెలుసు. అయితే యువతకు అలా చేయడం కాస్త కష్టమే. యోగాను హాబీగా ప్రారంభించినప్పటికీ.. వారు దాన్ని ఎక్కువ కాలం పాటించారు. అలాంటి వారికోసమే బీర్ యోగా అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఇందులో రెండు గ్లాసుల బీరును గొంతులోకి దించుకుని యోగా చేస్తారు. కొంత కాలంగా ఈ బీర్ యోగా ట్రెండ్ విదేశాల్లో బాగా పాపులర్ అవుతోంది.
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో రోడ్డు పక్కన కొందరు వ్యక్తులు యోగా చేస్తున్న వీడియోను వార్తా సంస్థ AFP తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, ఇక్కడ సాధారణ యోగాకి వీళ్లు చేస్తున్న యోగాకి ఒక తేడా ఉంది.. అదేంటంటే..ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో బీరు డబ్బా ఉంటుంది. వైరల్ వీడియోలో కూడా అందరూ యోగా భంగిమలో ఉన్నారు. ఒక చేత్తో బీర్ క్యాన్ పట్టుకుని తాగటం కనిపించింది. అయితే, వారంతా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చెప్పలేం కానీ.. ఈ వింత కాన్సెప్ట్ మాత్రం జనాల దృష్టిని ఆకర్షిస్తోంది.
జూన్ 2న పోస్ట్ చేసిన ఈ వీడియోకు 76 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే, వినియోగదారులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఒకరు సరదాగా ఇలా అంటున్నారు- ఇది చూసి చాలా మంది భారతీయ యువకులు డెన్మార్క్‌కి పారిపోతారని, మరొకరు ఇది సాంప్రదాయ యోగా కంటే మెరుగైనది అంటూ కామెంట్ చేశారు.. ఈ రకమైన యోగాతో చాలా మంది భారతీయులు చిరాకు పడుతున్నారు. ఇది భారతీయ సంప్రదాయాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడుతున్నారు.
VIDEO: Around 100 people gather to perform yoga by the Copenhagen harbour – cans of crisp, cold, refreshing beer in hand. The booze-fuelled class has been open for four years, and appears popular with its practitioners. pic.twitter.com/zM2kAlM9jg
— AFP News Agency (@AFP) June 2, 2023
విదేశాల్లో బీర్ యోగా ట్రెండ్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మొదట ఇది జర్మనీలో ప్రజాదరణ పొందింది. ఆ తరువాత, క్రమంగా ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా ఈ ధోరణిని అనుసరించడం ప్రారంభమైంది. ఏది ఏమైనప్పటికీ, భారతదేశంలోని యోగా నిపుణులు దీనిని సంస్కృతి ప్రకారం సరైనా యోగాగా భావించారు. ఎందుకంటే యోగా భారతదేశ ప్రాచీన నాగరికతలో ఒక భాగం. దాని నియమాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, బీర్ యోగా వంటి పోకడలను చేర్చడం ద్వారా భారతీయ యోగా స్వభావం మారిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..