Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 95 ఏళ్ల వృద్ధుడి జీవన పోరాటం.. పొట్ట కూటి కోసం డ్రమ్స్‌ వాయిస్తూ.. చూస్తే కన్నీళ్లు ఆగవు

అతను తన కడుపునిండా తిండి సంపాదించుకోవడానికి ఇంతలా కష్టపడుతున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో అందరి ముందు డ్రమ్ వాయిస్తూ.. ఒక్కోసారి అలసిపోయి నేలపై కూర్చుంటున్నాడు ఆ పెద్దాయన. ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఈ వయసులో అతడు పడుతున్న కష్టాన్ని చూసి చాలా మంది ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Viral Video: 95 ఏళ్ల వృద్ధుడి జీవన పోరాటం.. పొట్ట కూటి కోసం డ్రమ్స్‌ వాయిస్తూ.. చూస్తే కన్నీళ్లు ఆగవు
95 Year Old Man Viral Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 02, 2023 | 9:50 PM

వృద్ధాప్యం మనిషిని పూర్తి బలహీనుడిని చేస్తుంది. కొంతమందికి వృద్ధాప్యం అంటే పదవీ విరమణ. కానీ, కొందరు వృద్ధాప్యంలో నిశ్చింతగా ఉండకుండా పొట్టకూటి కోసం కష్టపడాల్సిన పెద్దలు ఎందరో ఉన్నారు. కొందరికి మూడు పూటలా అన్నం దొరికితే.. మరికొందరికి మాత్రం ఒక పూట కూడా తిండిలేక పస్తులు ఉండే దుస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కూడా అనేకమంది పెద్దలు అనుభవిస్తున్నారు. అలాంటి తమ కడుపు నింపుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి వృద్ధుడుపడుతున్న కష్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు అతనికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ వైరల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక వృద్ధుడు బుక్కెడు తిండి కోసం అతడు..మెడలో డప్పు వేసుకుని వాయిస్తున్నాడు. అతను తన కడుపునిండా తిండి సంపాదించుకోవడానికి ఇంతలా కష్టపడుతున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో అందరి ముందు డ్రమ్ వాయిస్తూ.. ఒక్కోసారి అలసిపోయి నేలపై కూర్చుంటున్నాడు ఆ పెద్దాయన. ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఈ వయసులో అతడు పడుతున్న కష్టాన్ని చూసి చాలా మంది ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ వీడియో మే 25న ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘పాండే రిత్విక్’ (mr_pandeyji_198) ద్వారా పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో ఇలా రాశారు. 95 ఏళ్ల ఆ తాత ఇప్పటికీ కష్టపడి సంపాదించుకుని తింటున్నాడు. ఇంతటి హృదయవిదారకమైన ఈ వీడియోని 18.3 మిలియన్లుకు పైగా ప్రజలు వీక్షించారు. 28 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. 33 వేలకు పైగా కామెంట్‌లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

రుత్విక్ తాను గుజరాత్‌కు చెందినవాడినని, ఈ తాత కూడా అక్కడి వారేనని, ఇస్లాం అనుచరుడు అని చెప్పాడు. అంతే కాకుండా తాతయ్యకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు చాలా మంది తాత ఫోన్ నంబర్ లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నారని రుత్విక్ తెలిపాడు. తాతా నీవు పడే కష్టానికి హ్యాట్సాఫ్. ఈ వయసులో కష్టపడుతున్న తాతని చూసి జనం చేతులెత్తి మొక్కుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..