కస్టమర్ పూల కుండీని పగలగొట్టిన ఫుడ్‌ డెలివరీ బాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి నెటిజన్లు ఫిదా..

ఫుడ్‌ డెలివరీ కోసం కస్టమర్‌ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్‌ అనుకోకుండా వారి పూల కుండీని పగులగొట్టాడు. దాంతో ఆ ఇంటి ఓనర్‌ తనపై ఎలా రియాక్ట్‌ అవుతాడోనని భయపడిపోయాడు. కానీ, అతడు భయపడినట్టుగా ఏమీ జరగలేదు. ఆ వ్యక్తి క్షమాపణ చెప్పడానికి ఆ ఇంటి యజమానిని పిలిచాడు. ఆ కుండీకి డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు...కానీ,

కస్టమర్ పూల కుండీని పగలగొట్టిన ఫుడ్‌ డెలివరీ బాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి నెటిజన్లు ఫిదా..
Flower Pot Apologizes
Follow us

|

Updated on: Jun 02, 2023 | 7:20 PM

ప్రతి వ్యక్తి తప్పులు చేస్తాడు.. కానీ, క్షమించలేనంత పెద్ద తప్పులు మాత్రం కావాలని ఎవరూ చేయరు. కానీ, తప్పు చేసిన వారిని క్షమించడానికి మాత్రం ఎదుటి వారికి విశాలమైన హృదయం కలిగి ఉండాలి. అలాంటి గొప్ప సందేశాత్మక సంఘటన ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఒక డెలివరీ బాయ్ అనుకోకుండా ఓ కస్టమర్ ఇంట్లో పూలకుండీ పగులగొట్టాడు. ఆ తర్వాత అతను చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సంఘటనను ఎలి మెక్‌కాన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా బయటి నుండి ఫుడ్ ఆర్డర్ చేయగా, డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఇంటికి వచ్చినప్పుడు, అనుకోకుండా వరండాలో ఉన్న పూల కుండీని పగలగొట్టినట్టుగా వివరించారు.

ఫుడ్‌ డెలివరీ కోసం కస్టమర్‌ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్‌ అనుకోకుండా వారి పూల కుండీని పగులగొట్టాడు. దాంతో ఆ ఇంటి ఓనర్‌ తనపై ఎలా రియాక్ట్‌ అవుతాడోనని భయపడిపోయాడు. కానీ, అతడు భయపడినట్టుగా ఏమీ జరగలేదు. ఆ వ్యక్తి క్షమాపణ చెప్పడానికి ఆ ఇంటి యజమానిని పిలిచాడు. ఆ కుండీకి డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు…కానీ, సదరు కస్టమర్‌ అతడిని మెచ్చుకున్నారు. తన మనసు మంచిదని, అందుకే పగిలిన కుండీకి డబ్బులిద్దామనుకున్నావు.. అంటూ ప్రశంసించారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఓ పోస్ట్ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా, రెండు రోజుల తరువాత దీనికి సంబంధించిన రెండు ఫోటోలు షేర్ చేస్తూ.. మరో పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ అప్ డేట్ పోస్టులో డెలివరీ మ్యాన్ జోర్డాన్ చేతితో రాసిన నోట్‌తో పాటు కొత్తగా కొన్న పూల కుండీని చూపించే రెండు ఫోటోలను షేర్ చేశారు..ఫుడ్ డెలివరీ బాయ్.. దీన్ని తమ ఇంటి ముందు విడిచిపెట్టివెళ్లినట్టుగా చెప్పారు. అంతేకాదు.. డెలివరీ బాయ్ రాసిన లెటర్ లో ఇలా ఉంది.. హలో.. నేను.. ఇట్స్ యువర్ ఉబెర్, ఈట్స్ డ్రైవర్ జోర్డాన్. మొన్న ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ మీ కుండీని పగలగొట్టాను. దానికి బదులు మరొకటి ఇవ్వాలనుకున్నాను. ఇది మీకు బహుమతి కాదు..  మీ మంచి మనసుకు నాకు ఇలా ఇవ్వాలనిపించింది. మీ పాత కుండీ అంత విలువైంది కాకపోవచ్చు.. ఏదో ఒకదానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. -జోర్డాన్” అని రాశాడు. డెలివరీ బాయ్‌ చేసిన పనికి కస్టమర్‌ ఫ్యామిలీతో పాటు ఇంటర్నెట్ వినియోగదారులు కూడా స్పందించారు. ఈ చర్యకు అతనిమీద అభిమానం కురిపించింది.

ఇకపోతే, వైరల్‌ అవుతున్న ఫోటోలో ఒక పూల కుండీతో పాటు చేతితో వ్రాసిన నోట్ కూడా కనిపిస్తుంది. అందులో ఇలా రాసి ఉంది- ‘ఆదివారం సాయంత్రం పగలగొట్టిన ఈ కుండీని తిరిగి నీకు ఇవ్వాలనుకున్నాను. ఇది మీకు బహుమతి లేదా సెంటిమెంట్ విలువ కాదని నేను ఆశిస్తున్నాను. దీనికి కూడా ధన్యవాదాలు. ఇది బహుశా అంత గొప్పది కాదని నాకు తెలుసు, కానీ మీకు ఉపయోగపడవచ్చు అంటూ డెలివరీ బాయ్ ఒక నోట్‌ రాసిపెట్టాడు. ఈ లవ్లీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటుంది. పోస్ట్‌కి 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో వేల సంఖ్యలో లైక్‌లు కూడా వచ్చాయి. వినియోగదారులు కూడా కామెంట్ల రూపంలో తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..