Elephant News: ఆడుకోవటానికి తోడులేక పిల్ల ఏనుగు ఏం చేసిందో చూడండి.. ఆ తిప్పటం చూస్తే నవ్వాపుకోలేరు..
ఏనుగు చాలా తెలివైనదిగా చెబుతారు. తనను ఎవరూ డిస్టర్బ్ చేయకుంటే తన దారిన తాను వెళ్తుంది. ఎవరికీ ఎలాంటి హానీ కలిగించదు. ఒకవేళ కోపం వస్తే గనుక గజరాజుకు దూరంగా ఉండటం మంచిది. ఏనుగు ఫుట్‌బాల్ ఆడటం మీరు సినిమాలో చూసి ఉండవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఏనుగులు చెరువులో సరదాగా ఆడుకోవటం కూడా కనిపిస్తుంది. కానీ పిల్ల ఏనుగులు తమ ఖాళీ సమయాల్లో వాటంతట అవే ఆడుకోవడం ప్రారంభిస్తాయి. ఈ క్రమంలోనే
సింహం అడవికి రాజు కావచ్చు, కానీ, ఏనుగుకు ఉండే విలువ కూడా తక్కువేం కాదు. భారీ శరీరం కలిగిన గజరాజు శక్తివంతమైనది. ఏనుగులు తమ ఖాళీ సమయంలో అద్భుతంగా డ్యాన్స్‌లు చేస్తాయని మీకు తెలుసా..? అడవిలోని ఏనుగులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటాయి. అలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పిల్ల ఏనుగుల అల్లరికి సంబంధించిన వీడియోలు మరీ ఎక్కువగా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఏనుగులు తమ తొండంతో చేసే విన్యాసాలు మరీ ఫన్నీగా ఉంటాయి. అవి తమ తొండంతో బాల్ ఆడుతుంటాయి. తొండంతో నీళ్లు జల్లుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటాయి. ఏనుగు పిల్ల ఎలాంటి సరదా సందడి చేస్తుందో చూపించే అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.
సాధారణంగా మన పిల్లలతో ఆడుకోవడానికి ఎవరూ లేకుంటే వాళ్లు ఏం చేస్తారు.. ఇంటర్‌నెట్ సాయంతో ఇంట్లోనే లూడో ఆడుతుంటారు. లేదంటే టీవీ చూస్తారు. టీవీ ఆఫ్‌లో ఉంది, మొబైల్లో కూడా గేమ్స్ ఆడుతుంటారు. చదువుకోవాలనే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ పిల్లవాడు ఎలా టైమ్ పాస్ చేస్తాడు. ఇప్పుడు పిల్ల ఏనుగు కూడా అలాంటిదే చేసింది.? ఏనుగు పిల్ల ఎలా ఆనందిస్తుంది? పిల్లల్లాగే ఏనుగు కూడా దురుసుగా ప్రవర్తిస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పిల్లలు చుట్టూ తిరుగుతూ ఆడుతున్నట్టే.. ఇక్కడ పిల్ల ఏనుగు కూడా స్వయంగా ఆడుకుంటూ ఎలా ఆనందిస్తుందో మీరే చూడండి..? ఈ విషయం తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఆలస్యం చేయకుండా వీడియో చూడండి.
Suppose you don’t have anything fun at all! Then you will have fun with yourself!??pic.twitter.com/eyCdAmr50y
— Figen (@TheFigen_) May 29, 2023
ఏనుగు చాలా తెలివైనదిగా చెబుతారు. తనను ఎవరూ డిస్టర్బ్ చేయకుంటే తన దారిన తాను వెళ్తుంది. ఎవరికీ ఎలాంటి హానీ కలిగించదు. ఒకవేళ కోపం వస్తే గనుక గజరాజుకు దూరంగా ఉండటం మంచిది. ఏనుగు ఫుట్‌బాల్ ఆడటం మీరు సినిమాలో చూసి ఉండవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఏనుగులు చెరువులో సరదాగా ఆడుకోవటం కూడా కనిపిస్తుంది. కానీ పిల్ల ఏనుగులు తమ ఖాళీ సమయాల్లో వాటంతట అవే ఆడుకోవడం ప్రారంభిస్తాయి. ఈ క్రమంలోనే పై వీడియోలో ఒక పిల్ల ఏనుగు తన తొండాన్ని గుండ్రంగా తిప్పుతూ ఎంజాయ్ చేస్తోంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు.
మరిన్ని వైరల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..