టాయిలెట్ సీట్‌పై కూర్చున్న మహిళ.. అంతలోనే మోకాళ్ల నొప్పితో విలవిలలాడిపోయింది.. సీన్ కట్ చేస్తే.!
అప్పుడప్పుడూ అనుకోని సంఘటనలే మన జీవితాలను తలక్రిందులు చేస్తాయి. సరిగ్గా ఓ 26 ఏళ్ల యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
అప్పుడప్పుడూ అనుకోని సంఘటనలే మన జీవితాలను తలక్రిందులు చేస్తాయి. సరిగ్గా ఓ 26 ఏళ్ల యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తీవ్రమైన మోకాళ్ల నొప్పితో ఆమె ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడి డాక్టర్లు స్కానింగ్ నిర్వహించి.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇది జరిగి ఏడేళ్లు అయింది. కానీ ఆమెకు జరిగిన ఈ ఘటన.. జీవితాన్నే గందరగోళంలో పడేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
న్యూయార్క్ పోస్ట్ కధనం ప్రకారం.. బెతనీ ఎసన్ అనే 26 ఏళ్ల యువతికి ఏడేళ్ల క్రితం తీవ్రమైన మోకాళ్ల నొప్పితో బాధపడింది. మెట్లు ఎక్కుతున్నా.. నడుస్తున్నా.. భరించలేని నొప్పి వచ్చేది. దీంతో ఆమె ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆ స్థానిక డాక్టర్ ఆమె మోకాలికి స్కానింగ్ నిర్వహించి.. ఎక్స్‌రే తీశారు. ఏదో ఇబ్బంది ఉందని చికిత్స కోసం ధెరపిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు.
అనంతరం 2017 ఫిబ్రవరిలో, ఆమె మెట్లు ఎక్కుతూ తీవ్రమైన మోకాళ్ల నొప్పితో బాధపడింది. ఆ తర్వాత ఎసన్ బాత్రూంలోని టాయిలెట్ సీట్‌పై కూర్చోగా.. మోకాలి ఎముక విరిగిపోతుంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు ఆమె మోకాలికి ఎక్స్‌రే తీసి.. అరుదైన ట్యూమర్ కారణంగా మోకాలి ఎముక బలహీనపడి.. విరిపోయిందని డాక్టర్లు చెప్పారు. తొడ ఎముక, మోకాలి ఎముకను రీప్లేస్‌మెంట్ చేయాలని వైద్యులు సూచించారు.
శస్త్రచికిత్స అనంతరం 99 శాతం మంది రోగులు మాములుగా నడవలేకపోయారని.. మళ్లీ నడవడం ప్రాక్టీస్ చేయాలంటూ ఎసన్‌కు చెప్పారు డాక్టర్లు. ‘హీల్స్ ధరించకోడదని, రన్నింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయకూడదని డాక్టర్లు సూచించారని’ అది విని కృంగిపోయానని ఎసన్ తెలిపింది. కాగా, ఎముకల్లో కణతులు అనేవి చాలా అరుదు వస్తాయని.. మీ మోకాళ్లలో నొప్పి లాంటిది వస్తే.. వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లండి. అలసత్వంగా వ్యవహరించవద్దని ఎసన్ చెబుతోంది.(Source)